Weight Loss Exercises : బరువు తగ్గడానికి చాలా ట్రై చేస్తున్నారా? కానీ జిమ్​కి వెళ్లే సౌలభ్యం లేదా? అయితే మీరు ఇంట్లో ఉంటూనే ఈ ఎఫెక్టివ్ వ్యాయామాలు చేస్తే బరువు తగ్గడమే కాకుండా.. మంచి ఆకృతిని పొందుతారు. పైగా ఇవి మీ కండరాలకు బలాన్ని చేకూర్చి మిమ్మల్ని ఫిట్​గా మార్చేస్తాయి. కేవలం ఐదు వ్యాయామాలు మీ పూర్తి శరీరానికి మంచి వర్క్​ అవుట్ అందిస్తాయి. బరువు తగ్గడానికి మీరు వీటిని రోజుకు రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీరు రోజంతా చురుగ్గా కూడా ఉంటారు. ఇంతకీ ఆ వర్క్ అవుట్స్ ఏంటి? వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బరువు వేగంగా తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.


పుష్ అప్స్​


పుష్ అప్స్ అనేది ఛాతీ, భుజాలే లక్ష్యంగా.. బరువు తగ్గడానికి చేసే మంచి వ్యాయామం. ఇది ఎగువ శరీర బలాన్ని పెంచి.. కేలరీలను బర్న్ చేస్తుంది. కండరాల స్థితిని మెరుగుపరుస్తుంది. మీ డైలీ రోటీన్​లో పుష్​ అప్స్ చేయడం వల్ల మీ శరీర పై భాగం పూర్తిగా టోన్ అవుతుంది. ముఖ్యంగా ఇది మీ పొట్టలోని కొవ్వును వేగంగా కరిగేలా చేస్తుంది. 


బర్పీస్​


కార్డియోలో ముఖ్యమైన వ్యాయామం బర్పీస్. ఇది మీ పూర్తి శరీరానికి ఫుల్ వర్క్​అవుట్​గా పని చేస్తుంది. హృదయ స్పందన రేటును పెంచి.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అంతేకాకుండా కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేసి.. కేలరీలను బర్న్ చేస్తుంది. కాబట్టి దీనిని మీరు మీ రోజూవారీ వ్యాయమంలో చేర్చుకోవచ్చు. 


స్క్వాట్స్


స్క్వాట్స్ బరువు తగ్గడానికి మెరుగైన వ్యాయామంగా చెప్పవచ్చు. ఇది మీ పూర్తి శరీరానికి శక్తిని చేకూరుస్తుంది. కండరాలను మెరుగుపరచి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగేలా చేస్తుంది. కేలరీలు బర్నే చేసేలా మీ శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీకు అనువైన పోజీషన్​ నుంచి ప్రారంభించి.. కరెక్ట్ ఫోజ్​కి రీచ్​ అవ్వండి. దీనిని సరైన ఫోజ్​లో చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.


బరువులు ఎత్తడం


ఇది ఒక పవర్​ ప్యాక్డ్ ఎక్సర్​సైజ్​గా చెప్పవచ్చు. డెడ్​లిఫ్ట్స్​ చేయడం వల్ల వీపు, హిప్స్, భుజాల స్ట్రాంగ్ అవుతాయి. అక్కడ కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా మొత్తం శరీరానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. కండరాల పెరుగుదలను ప్రోత్సాహించి.. జీవక్రియను పెంచుతుంది. దీనిని రెగ్యూలర్​గా చేయడం వల్ల మీరు విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలుగుతారు. 


లెగ్ రైజ్​


కొందరు ఎంత ఫిట్​గా ఉన్నా మంచి షేప్​లో ఉండరు. కొందరు ఎంత భారీగా ఉన్న మంచి బాడీ షేప్ ఉంటుంది. మీరు కూడా మంచి బాడీ షేప్​ కోసం ట్రై చేస్తున్నారా? అయితే లైగ్ రైజ్ చేయండి. ఇది పొట్టను తగ్గించడంలో కూడా మంచిపాత్ర పోషిస్తుంది. శరీరానికి బలాన్ని అందించి.. మొత్తం వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీరు ఎక్కువ కేలరీలు బర్న్ చేయకపోవచ్చు కానీ.. మీ శరీరం మంచి ఆకృతి పొందుతుంది. 


మీ ఫిట్​నెస్​ రోటీన్​లో ఈ వ్యాయామాలు చేరిస్తే కొవ్వు తగ్గడమే కాకుండా శరీరానికి మంచి బలం చేకూరుతుంది. మీరు భోజనం చేసిన వెంటనే ఈ వ్యాయమాలు చేయకూడదు. కనీసం 4 గంటలు గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఈ ఎక్సర్​సైజ్​ చేసేటప్పుడు మీ వీపు నిటారుగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వెన్ను నొప్పి సమస్యలు ఇబ్బంది పెడతాయి. మంచి ఫలితాలు పొందేందుకు ఉదయం, సాయంత్రం వీటిని చేయండి. వీటితో పాటు మీరు మంచి డైట్​ ఫాలో అవుతూ రిజల్ట్స్ మీరే ప్రత్యక్షంగా చూస్తారు. వ్యాయాలతో ఎంత కష్టపడినా.. మంచి డైట్​ ఫాలో అవ్వకుంటే రిజల్ట్స్ చూడడం చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఫిట్​నెస్​ గోల్స్​తో పాటు.. డైట్​ రూల్స్ పాటిస్తే.. త్వరగా, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 


Also Read : చల్లని సాయంత్రం వేళ.. నోరూరించే హెల్తీ స్నాక్


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.