ఎంత స్ట్రిక్ట్ డైట్ పాటించినా.. సాయంత్రం అయ్యేసరికి తెలియకుండానే స్నాక్స్ మీదకి మనసు లాగుతుంది. హెల్తీ ఫుడ్​తో సరిపెట్టుకున్నా.. ఎక్కడో తెలియని వెలితి ఉండిపోతుంది. నోటికి రుచి లేని ఫుడ్ ఎంత తీసుకున్నా.. కాసంత టేస్టీగా ఏదైనా తింటే మంచిదనిపిస్తుంది. అయితే టీస్టీగా ఉండే ఫుడ్ హెల్త్​కి అంత మంచిది కాదు అనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటే అది పొరపాటే. కొన్ని టెక్నిక్స్​తో హెల్తీ ఫుడ్​ని కూడా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. 


టేస్టీగా, హెల్తీగా ఉండే స్నాక్స్​లలో స్ప్రౌట్స్ చాట్​ ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ప్రోటీన్​తో నిండిన ఈ చాట్​ను టేస్టీగా ఎలా తయారు చేయాలో అనే ప్రశ్న మీలో ఉంటే మీరు దీనిని చదివేయండి. స్ప్రౌట్స్​తో తయారు చేసుకోగలిగే ఈ చాట్​ మీకు తక్షణ శక్తిని అందించడమే కాకుండా చిరుతిళ్ల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. పైగా మీ ఫిట్​నెస్​కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 


కావాల్సిన పదార్థాలు


మొలకెత్తిన బీన్స్ -  1 కప్పు


శనగలు - 1 కప్పు  (ఉడికించినవి)


కీర దోస - అరకప్పు (చిన్న ముక్కలు)


టొమాటో - అరకప్పు (చిన్న ముక్కలు)


పచ్చిమిర్చి - 2 సన్నగా తరగాలి


వేరుశెనగ -  1 టేబుల్ స్పూన్ (వేయించినవి)


బంగాళాదుంపలు - 1 పెద్దది (ఉడికించినది)


కొత్తిమీర - అరకప్పు (సన్నగా తరగాలి)


చాట్ మసాలా - 1 టీస్పూన్


సాల్ట్ - రుచికి తగినంత


నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్


జీలకర్ర పొడి - అర టీస్పూన్


సేవ్ - 2 టేబుల్ స్పూన్


తయారీ విధానం


ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో మొలకలు వేయాలి. దానిలో ఉడికించిన నల్ల శెనగలు వేయాలి. దానిలో కీరదోస, టొమాటో ముక్కలు వేయాలి. పల్లీలు, ఉడికించిన బంగాళదుంపలు స్మాష్ చేసి దానిలో వేయాలి. పచ్చిమిర్చి, సేవ్, చాట్ మసాలా, సాల్ట్, నిమ్మరసం, కొత్తిమీర, జీలకర్ర పొడి వేయాలి. అన్నింటిని బాగా కలపాలి. అంతే హెల్తీ స్నాక్ రెడీ అయిపోయినట్టే. దీనిని సేవ్, పచ్చి ఉల్లిపాయతో కలిపి సర్వ్ చేసుకోవచ్చు. 


ఈ స్నాక్​లో మీరు హెల్తీ ఫుడ్స్ ఏమైనా కలిపి తీసుకోవచ్చు. నట్స్ వంటి వాటిని కూడా యాడ్​ చేసుకోవచ్చు. ఇది మీకు తక్షణ శక్తిని అందిచడమే కాకుండా గట్స్ సమస్యలకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. ఒకవేళ ఈ స్నాక్​ను మీరు లేట్​గా తీసుకుంటే నైట్​ డిన్నర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారికి ఈ హెల్తీ స్నాక్ మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మీ నోటిని కట్టేసుకోకుండా.. ఇలాంటి హెల్తీ రెసిపీలతో మీరు క్రేవింగ్స్​ తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా దీనిని పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్​గా పెట్టవచ్చు. మధుమేహంతో ఇబ్బంది పడేవారు కూడా హ్యాపీగా దీనిని తినవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని తీసుకోవచ్చు. 


Also Read : మధుమేహం ఉన్నవారికి.. ఫిట్​గా ఉండాలనుకునేవారికి.. బెస్ట్ బ్రేక్​ఫాస్ట్ ఇదే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.