మొన్నటి దాకా ఒమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు ఆ బాధ్యతను "స్టెల్త్" BA.2 వేరియంట్ తీసుకుంది. ఇది ఇంకా చైనా నుంచి దాటిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఇజ్రాయిల్‌లో మరో "సంకర కరోనా వేరియంట్ " బయటపడింది. ఒరిజినల్ ఓమిక్రాన్,  "స్టెల్త్" BA.2 వేరియంట్ రెండూ ఒకే సారి సోకిన ఇద్దరు వ్యక్తులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ప్రకటించారు. ఇలాంటి వేరియంట్ ఇంత వరకూ ప్రపంచంలో కనిపించలేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. 


ఇక "స్టెల్త్ ఒమిక్రాన్" సీజన్ - మళ్లీ మాస్కులు, కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు తప్పవా ?


"స్టెల్త్" BA.2 వేరియంట్ విస్తృతమవుతున్న కారణందా ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో అంతర్జాతీయ  ప్రయాణికులకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో పరీక్షలు నిర్వహించినప్పుడు ఇద్దరికి ఒరిజినల్ ఓమిక్రాన్,  "స్టెల్త్" BA.2 వేరియంట్ కలిసి ఉన్నట్లుగా గుర్తించారు.ఈ ఇద్దరూ   తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నందున ప్రత్యేక వైద్య సంరక్షణ అవసరం లేదని ఇజ్రాయెల్  మంత్రిత్వ శాఖ ప్రకటించి పంపేసింది.  "స్టీల్త్ ఓమిక్రాన్" లేదా ఒమిక్రాన్ వేరియంట్ యొక్క B.A.2  అసలైన ఓమిక్రాన్ కంటే వేగంగా వ్యాపిస్తుంది, ఇది అసలు వైరస్ ,  ఇతర వైవిధ్యాల కంటే వేగంగా వ్యాపిస్తుంది.


కరోనా పుట్టినిల్లు చైనాలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు, రెండేళ్లలో ఇదే అత్యధికం
 
       ‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ అత్యధిక సాంక్రమిక శక్తి ఉన్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ .  ఒమిక్రాన్‌ కన్నా వేగంగా వ్యాపిస్తుంది. దీన్ని  ‘బీఏ. 2’ రకంగా పిలుస్తున్నారు.  మూడో వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాప్తి అవుతూ రికార్డు సృష్టించింది. అంతకన్నా ఒకటిన్నర రెట్ల వేగంతో స్టెల్త్ ఒమిక్రాన్ వ్యాప్తిస్తుంది.  ‘ స్టెల్త్‌ ఒమిక్రాన్‌’కు సంబంధించి.. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఈ వేరియంట్‌ను నిర్దిష్టంగా గుర్తించడానికి అవసరమయ్యే స్పైక్‌ ప్రొటీన్లలోని కొన్ని ఉత్పరివర్తనాలు లేవు. దీంతో గుర్తింపు కూడా కష్టంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. 


కరోనా బయటపడినప్పటి నుండి ప్రపంచం మొత్తం ఏదో మూల లాక్ డౌన్‌తో ఆంక్షలతో గడుపుతోంది. మూడో వేవ్ రూపంలో ఒమిక్రాన్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత అందరూ ఇక కరోనా పని అయిపోయిందని భావిస్తున్నారు. కానీ నాలుగో వే్ స్టెల్త్ ఒమిక్రాన్ రూపంలో దూసుకొస్తోంది. అయితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు కానీ.. ఎంత ప్రమాదకరం అనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. బ్రిటన్ లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్, స్టెల్త్ బీఏ. 2 రెండూ కలిసి ఉండటంతో..ఇది ఎంత ప్రమాదకరం అవుతుందో అన్న ఆందోళన కనిపిస్తోంది.