Coronavirus China: గత కొన్ని రోజుల కిందటి వరకు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కరోనా థర్డ్ వేవ్ కలవరపెట్టింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కానీ కరోనా పుట్టినిల్లుగా మారిన చైనాలో తాజాగా కొవిడ్ వ్యాప్తి ఆందోళకరంగా మారుతోంది. చైనాలో తాజాగా 3,393 కరోనా పాజిటివ్ కేసులు శనివారం నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నేషనల్ హెల్త్ కమిషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. 2020 ఫిబ్రవరి తరువాత ఒక్కరోజులో నమోదైన అత్యధిక కరోనా కేసులు ఇవి.


కరోనా వ్యాప్తి గత కొన్ని రోజులుగా చైనాలో కలకలం రేపుతోంది. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పలు నగరాలలో పాజిటివ్ కేసులు (Covid 19 Cases Registered In China) పెరిగాయి. షాంఘై లాంటి నగరాలలో స్కూళ్లు మూసివేయడంతో పాటు లాక్ డౌన్ విధించారు. ముఖ్యంగా ఈశాన్య చైనాలో కరోనా కేసులు నమోదవుతున్నాయని నిపుణులు వెల్లడించారు. 10 ప్రావిన్స్‌లలో రికవరీల కంటే తాజా పాజిటివ్ కేసులు అధికంగా ఉంటున్నాయి.


కరోనా వ్యాప్తితో లాక్‌డౌన్లు..
కోవిడ్ కొత్త వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తూండటంతో  దాదాపుగా 90 లక్ల మంది నివాసం ఉంటే పారిశ్రామిక నగరం చాంగ్ చున్‌లో ఇటీవల లాక్‌డౌన్ (Lock down several Northeastern China Cities) ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. అలాగే వారంతా మూడు సార్లు కరోనా పరీక్ష చేయించుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీ అయ్యాయి. చాంగ్‌చున్ నగరం నుంచి అన్ని రవాణా సౌకర్యాలను నిలిపివేశారు. వైద్యం తప్ప అన్ని వ్యాపార సంస్థలకూ సెలవులు ఇచ్చేశారు. 


చైనాలో మరోసారి కరోనా వైరస్ కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తోంది. పెద్ద సంఖ్యలో వివిధ నగరాల్లో రోజుకు వెయ్యి కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. చాంగ్‌చున్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని అంచనాకు రావడంతో చైనా ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ విధించింది. కరోనా వెలుగు చూసిన తర్వాత రెండేళ్లలో చాంగ్‌చున్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అందుకే లాక్ డౌన్ ప్రకటించేశారు. కరోనా విషయంలో చైనా కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఎక్కడైనా ఒకటి , రెండు కేసులు నమోదైనా.. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌గా ప్రకటించేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


జీరో టాలరెన్స్ విధానం..
కరోనా వైరస్ విషయంలో చైనా ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తోంది. ఎక్కడ కేసు బయటపడినా వ్యాప్తి చెందకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. చాంగ్ చున్‌తో పాటు  చుట్టుపక్కల ప్రావిన్స్‌తో సమానమైన పేరు ఉన్న జిలిన్ నగరంలో చైనా అధికారులు ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్ విధించారు. అక్కడ, ముందుజాగ్రత్త చర్యగా ఇతర నగరాలతో రాకపోకలు  నిలిపివేయబడ్డాయి. జిలిన్ నగరంలో రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. చైనా బహిర్గతం చేసే కరోనా కేసుల లెక్కలపై ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా సందేహాలు తొలగిపోలేదు.


Also Read: Russia Ukraine Wali Sniper : "పుతిన్‌" చుక్కలు చూపిస్తున్న వాలి ! వార్‌లో ఇప్పుడీయనే హీరో - ఈ వాలి ఎవరంటే ?


Also Read: India in Russia : రష్యాలోని భారత విద్యార్థులకు అలర్ట్ ! ఎంబసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఇవిగో...