అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే.. 
తరతరాల నీశిధి దాటే చిు వేకువ జాడతడే..  
పెనుతుపాను తలొంచిచూసే తొలి నిప్పు కణం అతడే.. 
ఇది అతడు సినిమాలో పాట లిరిక్స్ కావొచ్చు కానీ..  ఈ మాటలు.. పాటలు.. రష్యన్ భాషలో పుతిన్ చెవిలో మార్మిగిపోతూఉంటాయి. ఎందుకంటే.. రియల్ నిప్పుకణం ఇప్పుడు రష్యా సైన్యానికి ఉక్రెయిన్‌లో చుక్కలు చూపిస్తున్నాడు మరి. అతడి పేరు వాలి. పేరు కాస్త ఇండియన్ టచ్ ఉన్నా.. అతడు ఇండియన్ కాదు. ఫ్రెంచ్.. కెనడియన్. అతనేం చేస్తున్నాడని పుతిన్ వణికిపోతున్నాడంటారా ? మీరే చదవండి . 


ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఉద్ధృతం ! యుద్ధం తాజా విశేషాలు


నింగి, నేల.. లక్ష్యం ఏదైనా గురి తప్పకుండా కూల్చేయడం, కాల్చేయడం అతని ప్రత్యేకత. ప్రపంచంలోనే అత్యుత్తమ షూటర్లో ఒకరు వాలి . రాయల్‌ కెనడియన్ 22వ రెజిమెంట్‌కు చెందిన  ఈ 40 ఏళ్ల ఫ్రెంచ్-కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త 2009 నుంచి 2011 మధ్య అఫ్గనిస్తాన్ యుద్ధంలో రెండుసార్లు పనిచేశాడు. అతను అఫ్గనిస్తాన్‌లో పనిచేసిన సమయంలో అరబిక్‌లో రక్షకుడు అని అర్థం వచ్చే  పేరును సంపాదించుకున్నాడు. అయితే తన దేశం కాకపోయినా ఉక్రెయిన్‌కు స్వచ్చదంగా సేవలుఅందించేందుకు వచ్చాడు. వాలి అడిగితే ఉక్రెయిన్ అంగీకరించదా..? వెంటనే కావాల్సిన గన్నులిచ్చి రంగంలోకి దింపేశారు. 


రష్యాలోని భారత విద్యార్థులకు అలర్ట్ ! ఎంబసీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఇవిగో...
  
వాలీ ఈ వారం ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌ పోరాటంలో షూటింగ్ ప్రారంభించారు. ఇలాంటి షార్ప్ షూటర్లను స్నైఫర్‌గా పిలుస్తారు.  . అన్ని కుదిరితే ఒక్క రోజులో 40 మందిని షూట్ చంపేయగల ధీరుడు. సాధారణంగా గుడ్ స్నైపర్ అంటే సగటున రోజులో ఐదు నుంచి ఆరుగురిని మట్టుబెడతారు. ఇంక ఏడు నుంచి పది మందిని హతమార్చారంటే వారు గ్రేట్ స్నైపర్‌గా పేర్కొంటారు. కానీ, రాయల్ కెనెడియన్ 22వ రెజిమెంట్‌కు చెందిన వాలి ఒక్క రోజులో ఏకంగా 40 మందిని చంపేయగలడు.  


ఉక్రెయిన్ లో సిరియా ఉగ్రవాదులు, రష్యా కుతంత్రం చేస్తుంది - వీడియో విడుదల చేసిన జెలెన్స్కీ


ఇప్పటికే ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థకు దొరక్కుండా చాలా దిగువగా రష్యా యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. వాటిని ఎక్కడికక్కడ కూల్చేందుకు ఉక్రెయిన్ సైనికులు పని చేస్తున్నారు. ఇప్పుడు వారికి వాలి కూడా తోడయ్యారు. అందుకే రష్యా సైన్యం మరింత అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అందుకే ఇతను ఇప్పుడు ప్రపంచవ్యాప్త హీరో అయ్యాడు.