ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటు 0.5 శాతం కన్నా అధికంగా ఉండటంతో.. వైరస్‌ కట్టడి చేసేందుకు గ్రెడేడ్‌ రెస్పాన్‌ యాక్షన్‌ ప్లాన్‌ లెవల్‌ -1 కింద ఎల్లో అలర్ట్‌ను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ప్రకటించారు. దీంతో మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అక్కడ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.  ఎల్లో ఎలర్ట్‌ కారణంగా  సినిమా ధియేటర్లు, జిమ్స్‌ మూతపడతున్నాయి. మాల్స్‌, షాపులు.. సరి, బేసి సంఖ్యల ఆధారంగా తెరుచుకోనున్నాయి. 





Also Read: ఎన్నికల ఖర్చుల వరకూ అవినీతికి పాల్పడవచ్చట.. ఈ బీజేపీ ఎంపీ నిజాయితీ మిమ్మల్ని అవాక్కయ్యేలా చేస్తుంది !


సరి, బేసి సంఖ్యల ఆధారంగా మాల్స్‌, షాపులు.. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తారు. ప్రైవేటు సంస్థల్లో 50 శాతం సిబ్బందితో మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. వివాహ వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే అనుమతి ఉంటుంది.  సినిమా ధియేటర్లు, మల్లిప్లెక్స్‌లు, జిమ్‌లు మూసేస్తారు.  విద్యాసంస్థలు కూడా తెరుచుకోవారు.  రాత్రి 10 తర్వాత రెస్టారెంట్లు, బార్లు మూసేయాలి.  తెరిచిన సమయంలో కెపాసిటీలో సగం మందికే అనుమతి ఉంటుంది ఢిల్లీ మెట్రో కూడా సగం సామర్థ్యతతోనే కార్యకలాపాలు సాగించాల్సి ఉంటుంది.  సెలూన్‌, బార్బర్‌ షాపులు, పార్లర్లు, స్పా, వెల్‌నెస్‌ క్లినిక్స్‌ కూడా మూసేస్తారు. 


Also Read: మోడీ కాన్వాయ్‌లో కొత్త బెంజ్ కారు.. ఖరీదు రూ. 12 కోట్లపైనే..! దీని స్పెషాలిటీస్ తెలుసా ?


ఇక ఈ కామర్స్  ఆన్‌లైన్‌ డెలివరీలకు ఎలాంటి ఇబ్బంది లేదు.  రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూపెరుగుతున్నాయి. గత అనుభవాల  దృష్ట్యా ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదనుకుంటున్న కేజ్రీవాల్ సర్కార్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పటికే అనేక ఆంక్షలు పెట్టాయి. మొదటి సారిగా ఢిల్లీ ఎల్లో అలర్ట్ పెట్టింది. త్వరలో ఇతర రాష్ట్రాలూ అదే బాట పట్టే అవకాశం ఉంది. 


Also Read: సన్నీ లియోన్ సాంగ్ పై హోం మినిస్టర్ ఫైర్.. మూడు రోజుల్లో ఆ పని చేయకుంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి