దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని ఐఐటీ మద్రాస్‌లో 12 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ పెరుగుతుండటంతో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని  రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు. తమిళనాడులో బుధవారం కొత్తగా 31 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ జాగ్రత్తలను సీరియస్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు.







దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మళ్లీ మాస్కు వినియోగం తప్పనిసరి చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా నివారణకు ఫేస్ మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని చండీగఢ్, హరియాణా, పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు తెలిపాయి.


దేశంలో







దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే పెరిగింది. ఈ రోజు మరో 2,380 కరనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా కొత్తగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,231 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30 లక్షల 49 వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.53 శాతానికి పెరిగింది.


Also Read: Supreme Court: ‘పాపం చేసిన వ్యక్తికీ భవిష్యత్తు ఉంటుంది’ దోషికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


Also Read: Liver Disease Cases In US, Europe: పిల్లల్లో అంతుచిక్కని వ్యాధి- ఇలా సోకితే అలా కుప్పకూలుతున్నారు!