ఓవైపు కరోనా ఫోర్త్ వేవ్ భయపెడుతుంటే మరోవైపు అంతుచిక్కని ఓ కాలేయ వ్యాధి అమెరికా, యూకేలలోని చిన్నారులను కలవరపెడుతోంది. ఈ వ్యాధి సోకిన గంటల వ్యవధిలోనే పిల్లలు కుప్పకూలిపోతున్నారు. ప్రధానంగా శ్వాస తీసుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. 


మిస్టరీ


ఈ వ్యాధి సోకిన పిల్లలకు వైద్యులు తాత్కాలికంగా చికిత్స అందిస్తున్నప్పటికీ ఈ వ్యాధి ఏంటి? సోకడానికి కారణాలపై ఒక కచ్చితమైన అంచనాకు వైద్యులు రాలేకపోతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో అమెరికాలోని అలబామాలో 9 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరి వయసు 1-6 ఏళ్లు. బాధిత చిన్నారులను పరీక్షించిన వైద్యులు వాపు కారణంగా కాలేయం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు.


లక్షణాలు


ఈ వ్యాధి సోకిన వారికి దురద, కళ్లు, చర్మం పసుపు పచ్చగా మారడం, విపరీతమైన జ్వరం, శ్వాసలో ఇబ్బంది, కీళ్లు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, మూత్రం పచ్చగా, మలం బూడిద రంగులో వెళ్లడం వంటి లక్షణాలు ఉన్నాయి. రోగులు తాకిన ప్రదేశాలను తాకి అదే చేతులతో కళ్లు, ముక్కు, నోటిని తాకడం, తుమ్ము, దగ్గడం ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.


ఆ దేశాల్లో


అమెరికాలో ఇది జరిగిన 3 నెలల తర్వాత యూకేలోని ప్రధాన నగరాల్లో 74 మంది పిల్లలకు మళ్లీ ఇదే లక్షణాలతో వ్యాధి సోకింది. తాజాగా మరో 3 దేశాల్లో కూడా పదుల సంఖ్యలో ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ మిస్టరీ వ్యాధికి గల కారణాలను తేల్చేపనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. బాధిత చిన్నారులను రక్షించడానికి ప్రస్తుతం కాలేయ మార్పిడి చికిత్సలు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా, యూకే, స్పెయిన్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌ దేశాల్లో ఈ యట.వ్యాధి సోకింది.


ఈ వ్యాధి సోకిన చిన్నారుల కాలేయంలో అనూహ్యంగా వాపు రావడంతో హెపటైటిస్‌ వైరస్‌లు (ఏ,బీ,సీ,డీ,ఈ) ఈ వ్యాధికి కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తొలుత భావించింది. అయితే పరిశోధనల్లో ఇది నిర్ధారణ కాలేదు.


జలుబు, జ్వరాన్ని కలిగించే ఎడినో వైరస్‌, కొవిడ్‌-19కు కారణమయ్యే సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ చిన్నారుల శరీరంలో ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. చిన్నారుల్లో హెపటైటిస్‌, ఎడినో వైరస్‌ 41ను గుర్తించినట్టు అలబామా వైద్య విభాగం తెలిపింది. 


Also Read: DDMA Covid-19 Guidelines: మళ్లీ అదే కథ- దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఇక మాస్కు పెట్టుకోకపోతే!



Also Read: Coronavirus Cases India: భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు, భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్‌కు సంకేతమా !