Tulsi Bhai: మోదీకి షాకిచ్చిన WHO చీఫ్- మురిసిపోయిన ప్రధాని, వీడియో వైరల్!

ABP Desam Updated at: 20 Apr 2022 07:34 PM (IST)
Edited By: Murali Krishna

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్.. ప్రధాని మోదీకి షాకిచ్చారు. ఓ కార్యక్రమంలో గుజరాతీలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

మోదీకి షాకిచ్చిన WHO చీఫ్- మురిసిపోయిన ప్రధాని, వీడియో వైరల్!

NEXT PREV

WHO చీఫ్ టెడ్రోస్ అథ‌నోమ్‌కు ప్ర‌ధాని నరేంద్ర మోదీ కొత్త పేరు పెట్టారు. గుజ‌రాత్‌లోని గాంధీ న‌గ‌ర్‌లో మూడు రోజుల పాటు గ్లోబ‌ల్ ఆయుశ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి డబ్ల్యూహెచ్‌ఓ అధినేత టెడ్రోస్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా టెడ్రోస్ గుజ‌రాతీలో మాట్లాడి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.






మోదీ చిరునవ్వు


"అంద‌రికీ న‌మ‌స్కారం, ఎలా ఉన్నారు?" అంటూ టెడ్రోస్ గుజ‌రాతీ భాష‌లో ప‌ల‌కరించారు. దీంతో అందరూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. ఇది చూసిన మోదీ సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు.








టెడ్రోస్ నాకు మంచి మిత్రుడు. త‌న‌కు భారత్‌కు చెందిన గురువే చ‌దువు చెప్పారని నాతో అన్నారు. తాను ప‌క్కా గుజ‌రాతీ అయిపోయాన‌ని, త‌న‌కు గుజ‌రాతీ పేరును పెట్టాల‌ని ఆయన నన్ను కోరారు. కనుక ఆయనకు తుల‌సీ భాయ్ అని నామ‌క‌ర‌ణం చేస్తున్నాను.                                                   -  ప్రధాని నరేంద్ర మోదీ


సంప్రదాయ వైద్యం


గుజరాత్‌ పర్యటనలో భాగంగా మోదీ రెండో రోజైన మంగళవారం ఆ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ఘెబ్రియేసస్‌, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జగన్నాథ్‌ పాల్గొన్నారు.


ఈ అంతర్జాతీయ కేంద్రంతో సంప్రదాయ వైద్యంలో ఓ నూతన శకం ప్రారంభం కానుందని ప్రధాని మోదీ అన్నారు. రానున్న 25 ఏళ్లలో ఈ కేంద్రం ప్రపంచ మానవాళికి దగ్గర కానుందని మోదీ అన్నారు. ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్యాలు కేవలం చికిత్సా విధానాలు కావని అవి భారతీయుల సమగ్ర జీవన విధానానికి ప్రతిబింబాలని మోదీ పేర్కొన్నారు.


Also Read: DDMA Covid-19 Guidelines: మళ్లీ అదే కథ- దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఇక మాస్కు పెట్టుకోకపోతే!



Also Read: Coronavirus Cases India: భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు, భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్‌కు సంకేతమా !


Published at: 20 Apr 2022 04:42 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.