కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 5-12 లోపు పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి గురువారం నిపుణుల కమిటీ ఈ ప్రకటన చేసింది. 5-12 ఏళ్ల వయసు పిల్లల కోసం రెండు వ్యాక్సిన్‌లను వేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చిన్న పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కార్బివ్యాక్స్‌తో పాటు కొవాగ్జిన్‌కు కూడా అనుమతి ఇస్తున్నట్లు నిపుణుల కమిటీ తెలిపింది. దీంతో త్వరలోనే 5-12 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి
అంతకుముందు
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీసుకోగా, కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపింది. అయితే, కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో పలు కరోనా వేవ్ లను అడ్డుకోగలిగింది భారత్. అయితే, కొవిడ్ నియంత్రణ చర్యల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలక పాత్ర పోషించింది.
ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే 12-15 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను కేంద్రం మార్చిలో ప్రారంభించనుంది. అలాగే, సీనియర్ సిటిజన్‌లకు ముందస్తు జాగ్రత్త మోతాదులను (బూస్టర్ డోసులు లాంటివి) అందిస్తోంది. మార్చి 16 నుంచి 12-13 ఏళ్లు, 13-14 ఏళ్ల వారికి కరోనా వైరస్ టీకాలు వేయడం ప్రారంభించింది.
కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే పెరిగింది. ఈ రోజు మరో 2,380 కరనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా కొత్తగా 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,231 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30 లక్షల 49 వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.53 శాతానికి పెరిగింది.,
Also Read: Liver Disease Cases In US, Europe: పిల్లల్లో అంతుచిక్కని వ్యాధి- ఇలా సోకితే అలా కుప్పకూలుతున్నారు!