RRR Japan Cover Song | RRR సినిమాకు ఎక్కడాలేని క్రేజ్ లభిస్తోంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ వసూళ్లలో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్, సాంగ్స్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’లోని స్టెప్పులో సోషల్ మీడియాలోని రీల్స్, షార్ట్స్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులను అనుకరిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 


తాజాగా జపాన్‌కు చెందిన హిరోమునిరు(HIROMUNIERU) అనే యూట్యూబ్ చానెల్‌లో RRR సినిమాలోని ‘ఎత్తర జెండా’ సాంగ్ వైరల్‌గా మారింది. అయితే, ఇది మన ఇండియన్ వెర్షన్ కాదు. ‘ఎత్తర జెండా’ తెలుగు పాటకు ఇది జపాన్ వెర్షన్. ఆ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ వేసిన స్టెప్పులు మాత్రమే కాదు, వారి తరహాలోనే దుస్తులు ధరించి ఇంట్లోనే ఆ పాటకు డ్యాన్స్ చేశారు. అన్నీ సేమ్ టు సేమ్ దించేసినా.. అక్కడక్కడా ఖూనీ చేశారనే భావన కూడా కలుగుతుంది. అయితే, దాన్ని సీరియస్‌గా కాకుండా ఫన్నీగా తీసుకుంటే నవ్వు ఆగదు. 


Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?


‘హీరోమునిరు’ యూట్యూబ్ చానెల్‌లో ఎక్కువగా కవర్ సాంగ్స్, ప్రాంక్, ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఈ వీడియోలో కనిపించే ఆ ముగ్గురు అన్నా చెల్లెల్లు. వీరికి ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే, వీరి పోస్ట్ చేసిన వీడియోల్లో చాలావరకు ఎన్టీఆర్ కవర్ సాంగ్సే ఉంటాయి. వీళ్లు ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ సినిమాలోని ‘‘చీమ చీమ’’ సాంగ్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’లోని ‘‘ఎత్తెర జెండా’’ వరకు ఏ సాంగ్‌ను విడిచిపెట్టలేదు. అయితే, ఎన్టీఆర్ డ్యాన్స్‌ను అనుకరించడం అంతా ఈజీ కాదు. కానీ, వీరు చాలా సింపుల్‌గా ఆ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాగే, వీరు కొన్ని రామ్ చరణ్ పాటలకు కూడా కవర్ సాంగ్స్ చేశారు. ముఖ్యంగా ‘‘నాటు నాటు’’ సాంగ్‌ను తమదైన స్టెల్లో చేసి ఆశ్చర్యపరిచారు. మీరు కూడా వారి డ్యాన్స్ ఎంజాయ్ చేయండి. 


Also Read: కాజల్ కొడుకు పేరేంటో? ఆ పేరుకు అర్థం ఏమిటో తెలుసా?


‘‘నాటు నాటు’’ కవర్ సాంగ్: 



‘‘ఎత్తెర జెండా’’ కవర్ సాంగ్: 



రామ్ చరణ్ ‘‘లైలా ఓ లైలా’’ కవర్ సాంగ్: