ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) నిన్న ఉదయం (ఏప్రిల్ 19, మంగళవారం) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ నిన్న అధికారికంగా వెల్లడించలేదు. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ హిందీ మీడియాతో 'అక్కకి అబ్బాయి పుట్టాడు. తల్లి, బిడ్డ... ఇద్దరూ క్షేమంగా ఉన్నారు' అని చెప్పారు. ఈ రోజు కాజల్ భర్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu) తమకు అబ్బాయి పుట్టినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


గౌతమ్ కిచ్లూ, కాజల్ అగర్వాల్ దంపతులు తమ బిడ్డకు 'నీల్' (Kajal Aggarwal's Baby Boy named as Neil) అని నామకరణం చేశారు. నీల్ అంటే ఛాంపియన్ అని మీనింగ్ అంట.


"ఏప్రిల్ 19న నీల్ కిచ్లూ (Kajal's Son Neil Kitchlu) జన్మించాడని చెప్పడానికి మేం చాలా సంతోషిస్తున్నాము. చిన్నారిని ప్రేమతో మా కుటుంబ సభ్యులు అంతా స్వాగతిస్తున్నాం. మా మనసులు కృతజ్ఞతతో నిండాయి. మాపై ప్రేమను చూపించి, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని గౌతమ్ కిచ్లూ పేర్కొన్నారు.


Also Read: అమ్మాయి ముద్దు పెట్టేసింది కానీ పెళ్లి ఇష్టం లేదంటోంది - పెళ్లికొడుకు పరిస్థితి ఏంటి?


గౌతమ్, కాజల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ఈ ఏడాది జనవరిలో తాను ప్రెగ్నెంట్ అని కాజల్ వెల్లడించారు. ఆ తర్వాత నుంచి గర్భవతులు చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ పలు వీడియోలు చేశారు. పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాల్లో నటించారు. ఆమె నటించిన 'ఆచార్య' సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.


Also Read: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ