ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 31,158 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 135 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,486కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 164 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,400 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1326 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,212కి చేరింది. గడచిన 24 గంటల్లో 164 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1326 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,486కు చేరింది. 


Also Read:  సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్


దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 7,495 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 434 మంది కరోనా కారణంగా మరణించారు. గడచిన 24 గంటల్లో 6,960 మంది కోలుకున్నారు. దేశంలో కోవిడ్ టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. బుధవారం దేశంలో 70,17,671 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు 1,39,69,76,774 వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. 








  • మొత్తం కేసులు: 3,47,65,976

  • మరణాలు: 4,78,759

  • యాక్టివ్ కేసులు: 78,291

  • కోలుకున్నవారు: 3,42,08,926


Also Read: ఒమిక్రాన్‌పై మోదీ కీలక సమీక్ష.. రాత్రి కర్ఫ్యూపై నిర్ణయం??


ప్రపంచంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 236 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కొత్త వేరియంట్‌ కేసులు, కోవిడ్‌ కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంక్షల్ని విధిస్తున్నాయి. కేంద్రం కూడా రాత్రిపూట కర్ఫ్యూలు అమలు చేయాలంటూ మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణలో కూడా ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్న కారణంగా  ఆంక్షలు అమలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


Also Read:  కొప్పర్తి ఇండస్ట్రీయల్ హబ్ ను ప్రారంభించిన సీఎం జగన్... ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి