ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 31,855 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 137 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,478కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 189 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,59,500 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1705 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,683కి చేరింది. గడచిన 24 గంటల్లో 189 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1705 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,478కు చేరింది.
Also Read: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి.... హర్షం వ్యక్తం చేసిన అదర్ పునావాలా
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 289 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,706 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 34,733,194
- మొత్తం మరణాలు: 477,158
- యాక్టివ్ కేసులు: 84,565
- కోలుకున్నవారు: 3,41,71,471
Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి