ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ పై ఆందోళన కనిపిస్తోంది. అయితే అసలు ఆ వేరియంట్ లక్షణాలేమిటన్నదానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. కానీ ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్న పరిశోధనలు మాత్రం కొత్త విషయాలు ఏమీ  చెప్పడం లేదు. సాధరాణ లక్షణాలే ఉంటాయని చెబుతున్నాయి. ముక్కు కారుతూ ఉండటం..  గొంతులో గరగరగా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా అనుమానించవచ్చని తాజాగా యూకోలో జరిగిన ఓ స్టడీలో తేలింది. ఓమిక్రాన్ సోకిన బాధితులకు రాత్రి సమయంలో చెమటలు పట్టడం, పొడి దగ్గు లక్షణాలు  జ్వరం, కండరాల నొప్పి కూడా ఒమిక్రాన్‌ లక్షణాలు కావొచ్చని గుర్తించారు. 


Also Read: మరో రెండేళ్లు కరోనా వదలదట.. ఫైజర్ పరిశోధనలో కీలక అంశాలు


డిసెంబర్ 3వ తేదీ నుంచి 1౦వ తేదీ వరకు జరిపిన సర్వేలో  ఒమిక్రాన్ బారిన పడిన వారి నుంచి సేకరించిన వివరాల ప్రకారం ముక్కు కారడం, తలనొప్పి, మంపుగా ఉండటం వంటివి ఉన్నాయి. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులలో గొంతు నొప్పికి బదులుగా గొంతు వాపు వంటి సమస్యను గుర్తించినట్లుగా మరికొన్ని పరిశోధనలు వెల్లడించాయి.  కరోనా ఏదైనా వైవిధ్యంతో తేలికపాటి లేదా అధిక జ్వరం రావొచ్చని భావిస్తుున్నారు. 


Also Read: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి.... హర్షం వ్యక్తం చేసిన అదర్ పునావాలా


అన్ని మునుపటి వేరియంట్‌ల మాదిరిగానే, ఓమిక్రాన్ కూడా బాధితుడికి బాగా అలసిపోయేలా చేస్తుంది. ఇందులో సోకిన వ్యక్తి శక్తి స్థాయి బాగా తగ్గిపోతుంది. శరీరంలో కనిపించే ఈ లక్షణాన్ని గుర్తించి వెంటనే కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.ఒమిక్రాన్‌ వేరియంట్ సోకితే ఫలనా లక్షణాలు ఉంటాయని ఇప్పటికీ ప్రత్యేకంగా గుర్తించలేకపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటనలు చేస్తోంది. కొత్త వేరియంట్‌కు మ్యూటేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదమని అంచనా వేస్తున్నారు. కానీ ఇంత వరకూ ఆ వేరియంట్ ఎంత ప్రమాదకమైనదో మాత్రం గుర్తించలేకపోయారు. కానీ శరవేగంగా వ్యాపిస్తుందని మాత్రం పరిశోధకులు ఓ నిర్ణయానికి వచ్చారు. 


Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!



టీకా రెండు మోతాదులను తీసుకున్న వ్యక్తులకు కూడా ఒమిక్రాన్‌ సులువుగా సోకుతుంది.  ఓమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రమాదకరమో రానున్న కొద్ది రోజులు లేదా వారాల్లో తేలనుంది. అప్పటి వరకూ అందరూ జాగ్రత్తగా ఉండటమే చేయగలిగింది. 


Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్


Also Read: తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్‌ కేసులు... 7కు చేరిన మొత్తం కేసులు