ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 29,228 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 132 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,468కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 186 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,817 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1823 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,108కి చేరింది. గడచిన 24 గంటల్లో 186 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1823 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,468కు చేరింది.
Also Read: ఈ బ్యాంకు హోమ్ , కార్ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 5,784 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 571 రోజుల్లో ఇదే అత్యల్పం. 252 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,995 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. రికవరీ రేటు 98.37%గా ఉంది. తాజాగా 9,90,482 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యాశాఖ వెల్లడించింది. 252 మరణాల్లో 203 కేరళలో కాగా 12 తమిళనాడులో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. సోమవారం 66,98,601 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,33,88,12,577కు చేరింది.
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు నమోదుకాగా రాజస్థాన్ (9), కర్ణాటక (3), గుజరాత్ (4), కేరళ (1), ఆంధ్రప్రదేశ్ (1), ఛండీగఢ్ (1), దిల్లీ (2) ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. డిసెంబర్ 9 వరకు ఉన్న డేటా ప్రకారం మొత్తం 63 దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read: PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి