ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 32,793 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 142 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,462కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 188 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,101 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1989 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,552కి చేరింది. గడచిన 24 గంటల్లో 188 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1989 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,462కు చేరింది.
Also Read: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
దేశంలో 26 ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 26కు చేరింది. తాజాగా గుజరాత్లో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య మూడుకు చేరింది. ముంబయి ధారావిలో ఒకరికి ఒమిక్రాన్ ఉన్నట్లు వెల్లడైంది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తితో దగ్గరగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా వెల్లడైంది. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని లక్షణాలేవీ లేవని జామ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ ఖరాడి తెలిపారు.
Also Read: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు
భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
Also Read: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి