Benefits Of Jatamansi : ఆధునిక కాలంలో కూడా ఆయుర్వేదానికి మంచి గిరాకీ ఉంది. వైద్యపరిజ్ఞానం ఎన్ని అంచెలు ఎదిగినా.. ఆయుర్వేదానికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. మన భారత దేశంలో చాలా మంది ఇప్పటికీ ఇంగ్లీష్ మందుల జోలికి పోకుండా.. ఆయుర్వేదాన్ని మాత్రమే నమ్మేవారు ఉన్నారు. అలాగే ఎన్నో ఔషదగుణాలున్న మూలికలు చెట్లరూపంలో మన కళ్లముందే ఉంటాయి కానీ.. వాటి గురించి మాత్రం మనకు అవగాహన ఉండదు. వాటి విలువలు ఎవరో చెప్తే కానీ తెలియదు. వాటి ఫలితాలు మనం కూడా పొందిన తర్వాతనే నమ్ముతాము. 


అలా చెప్పుకోవాల్సిన వాటిలో జటామాన్సి ఒకటి. ఇది మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఆంగ్లంలో దీనిని స్పైకెనార్డ్ అంటారు. ఇది మూలికల రూపంలోనే కాకుండా మెడిసన్ రూపంలో కూడా అందిస్తూ ఉంటారు. హిమాలయాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. దీనిని ఉపయోగించి పలు నూనెలు, పెర్ఫ్యూమ్స్ కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలకు దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. మరి దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


మూర్ఛ వ్యాధికై..


జటామాన్సీ వల్ల కలిగే ముఖ్యమైన ఉయోగాలలో మూర్ఛకి చేసే చికిత్స ఒకటి. ఇది సమర్థవంతంగా మూర్ఛ వ్యాధిని తగ్గిస్తుంది. ఆయుర్వేదం గురించి ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం.. వాత, పిత్త, కఫం వల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది. జటామాన్సీ శరీరంలోని ఈ వాత, పిత్త, కఫంలను తగ్గించి.. వాటిని సమతుల్యం చేస్తుంది. మీకు లేదా మీకు తెలిసిన వారికి మూర్ఛ వ్యాధి ఉంటే.. వైద్యుని సంప్రదించి ఆయన సూచనల మేరకు.. తగిన మోతాదులో జటామాన్సీ తీసుకోవచ్చు. అంతేకానీ తర్వగా తగ్గిపోతుందేనని ఎక్కువ తీసుకుంటే పరిస్థితి చేజారి పోతుంది. 


మైరుగైన జ్ఞాపకశక్తికి..


జటామాన్సీ మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మీలోని సమాచారాన్ని మీరు ఎక్కువ సేపు గుర్తించుకోవడంలో సహాయం చేస్తుంది. కాబట్టే ఇది అభిజ్ఞా ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు. ఈ ఆయుర్వేదం.. మెమరీ పునరుద్ధరణ ఏజెంట్ వలె పని చేసి.. తక్కువ మెమరీతో ఇబ్బంది పడేవారికి మద్ధతు ఇస్తుంది. నాడీ వ్యవస్థలో వాతాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మెరుగైన జ్ఞాపకశక్తికి, మానసికంగా చురుకుగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. 


జుట్టు ఆరోగ్యానికై.. 


మీకు జుట్టు ఊడిపోతుందా? దానిని ఎలా అయినా కంట్రోల్ చేసి.. మంచి పెరుగుదల పొందాలనుకుంటే జటామాన్సీ మీకు సరైన ఎంపిక. ఎందుకంటే ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా స్కాల్ప్ నుంచి జుట్టును దృఢంగా మారేలా చేస్తుంది. ఫోలికల్స్​ను మెరుగుపరిచి జుట్టుకు సహజమైన మెరుపు, సిల్కీనెస్​ని అందిస్తుంది. చుండ్రుతో ఇబ్బంది పడేవారు కూడా ఈ సహజ మూలికతో దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. సిల్కీ, స్మూత్ హెయిర్ కోసం మీరు ఈ ఆయిల్​ను ఉపయోగించవచ్చు.


నిద్రలేమి సమస్యకు..


మీకు నిద్రలేమి సమస్య ఉంటే జటామాన్సీని ఉపయోగించవచ్చు. నిపుణుల ప్రకారం.. ఇది నిద్రలేని రాత్రులను తరిమే సహజమైన ఇంటి నివారణ. ఇది శరీరానికే కాదు.. మనసుకు కూడా ఉపశమనం అందించి ప్రశాంతతను అందిస్తుంది. ఒత్తిడి, చిరాకు, నిరాశ, ఆందోళనలను దూరం చేస్తుంది. మానసిక రుగ్మతలను తగ్గించి.. మీకు పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి వైద్యుని సంప్రదించి మీరు దీనిని తీసుకోవచ్చు. 


మరెన్నో సమస్యలు దూరం..


ఇవే కాకుండా కాలేయ సమస్యలను దూరం చేయడంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. జ్వరం, వెర్టిగో, నరాల సమస్యల నుంచి ఉపశనం కలిగిస్తుంది. ఔషద నూనె తయారీలో సువాసన ఏజెంట్​గా కూడా దీనిని ఉపయోగిస్తారు. గుండె జబ్బులు, రక్తపోటుతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని వినియోగించవచ్చు. ఆకలిని పెంచడమే కాకుండా.. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. యాంటీ క్యాన్సర్ ఏజెంట్​గా కూడా ఇది మెరుగైన ఫలితాలు అందిస్తుంది.


ఎలా తీసుకోవాలంటే..


వైద్యుని సూచనల ప్రకారం దీనిని పొడి రూపంలో లేదా కషాయాల్లో ఉపయోగించవచ్చు. దీనితో తయారు చేసిన నూనెను జుట్టుకు నేరుగా పూయవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పలేము కానీ.. మీరు దీనిని వినియోగించాలనుకుంటే మాత్రం కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోండి. వినియోగిస్తున్నప్పుడు ఏమైనా తేడాలు మీరు గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 


Also Read : 'టీ'ని మళ్లీ మళ్లీ వేడిచేసి తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.