గుమ్మడి కాయ విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాల్లో విటమిన్ A, E, C లతో పాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల గుమ్మడికాయ విత్తనాలను తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా వైద్యులను సంప్రదించి మాత్రమే గుమ్మడి కాయ గింజలను తీసుకోవాలి. ఏయే సమస్యలు ఉన్నవారు గుమ్మడికాయ విత్తనాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 


Also Read: జామ కాయే కాదు... జామ ఆకులు కూడా ఎంతో మంచివి... ఆ ప్రయోజనాలేంటో మీకు తెలుసా?


* గుమ్మడికాయ విత్తనాలను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ల సూచన మేర మాత్రమే తీసుకోవాలి. కొందరికి ఇవి కొన్ని అనారోగ్య సమస్యలను కలగజేస్తాయి. కనుక వీరు ఈ విత్తనాలను తినే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి. 
* గుమ్మడికాయ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. అయితే లో బీపీ సమస్య ఉన్నవారు ఈ విత్తనాలను తింటే బీపీ ఇంకా తగ్గుతుంది. దీంతో లేనిపోని సమస్యలు వస్తాయి. కనుక లో బీపీ ఉన్నవారు ఈ విత్తనాలను తినరాదు.
* డయాబెటిస్‌ ఉన్న వారు ఈ విత్తనాలు తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. తక్కువ షుగర్ తక్కువ లెవల్స్ ఉన్న వారు మాత్రం వీటిని తీసుకోకూడదు. వీళ్లు తీసుకుంటే షుగర్ లెవల్స్ మరింత తగ్గి అపాయం కలగవచ్చు. 


Also Read: పిస్తా పప్పు తింటే కలిగే అద్భుత ప్రయోజనాలేంటి?



* గుమ్మడికాయ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియకు చాలా మంచిది. అయితే ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తినకూడదు. 
* ప్రోస్టేట్‌, మూత్రాశ‌య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ ఈ విత్త‌నాల‌ను తింటే మేలు జరుగుతుంది. ఈ విత్త‌నాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది.  బీపీని త‌గ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
* నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది. నిద్ర చ‌క్క‌గా వ‌స్తుంది.
* గుమ్మ‌డికాయ విత్త‌నాల్లో ఉండే జింక్ పురుషుల్లో వీర్యం నాణ్య‌త‌ను పెంచుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.
* గుమ్మ‌డికాయ‌ల్లో ఉండే ఫైబ‌ర్ అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. గుమ్మ‌డి కాయ‌ గింజలతో పాటు కూరలను తిన‌డం వ‌ల్ల అందులో ఉండే ఫైబ‌ర్ మనం తిన్న ఆహారాన్ని నెమ్మ‌దిగా జీర్ణం చేస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌దు. ఫ‌లితంగా త‌క్కువ ఆహారం తీసుకుంటాం. దీంతో అధిక బ‌రువు త‌గ్గ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. వీటిల్లో 90 శాతం నీరే ఉంటుంది. అందువ‌ల్ల శరీరానికి కూడా క్యాల‌రీలు త‌క్కువ‌గా ల‌భిస్తాయి. 


Also Read: కళ్ల కింద నల్లటి వలయాలు ఎలా తగ్గించుకోవాలి? వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి