అనేక రకాల నట్స్‌లో పిస్తా పప్పు కూడా ఒకటి. పిస్తా పప్పులు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిల్లో మన శరీరానికి అవసరం అయ్యే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ పప్పుల్లో ఫైబర్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
అధిక బరువును తగ్గించేందుకు, గుండెను, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఈ పప్పుల్లో అధికంగా ఉంటాయి. బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పు కంటే ఆహారంలో తక్కువగా వాడుతుంటాం. కానీ పిస్తా పప్పుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: బ్రౌన్ బ్రెడ్ VSవైట్ బ్రెడ్.. ఈ రెండింటిలో ఏది మంచిది? ఎందుకు మంచిది?
కళ్ళ కోసం
పిస్తాపప్పులో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. విటమిన్ A కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందువల్ల, మీరు కళ్ళకు సంబంధించిన సమస్యలను నివారించాలనుకుంటే...కచ్ఛితంగా పిస్తా తినండి.
గుండె జబ్బుల నుండి రక్షణ
కోట్లాది మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. పిస్తా పప్పులు కార్డియో ప్రొటెక్టివ్ కార్యకలాపాలను కలిగి ఉంటాయి. ఇది గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది. అందుకే గుండె జబ్బులను నివారించడానికి క్రమం తప్పకుండా పిస్తా తినవచ్చు.
క్యాన్సర్ నివారిణి
పిస్తాపప్పులు... కీమో నివారణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు సాయపడుతుంది. అందువల్ల, క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి పిస్తా పప్పులను మీ ఆహారంలో చేర్చుకోండి.
ఎముకలు బలోపేతం
ఎముకలు బలహీనంగా ఉంటే శరీర స్థితిని పాడు చేస్తుంది. పిస్తా పప్పులో కాల్షియం ఉండటం వల్ల ఎముకలను బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. వృద్ధులు క్రమం తప్పకుండా పిస్తా తినాలి. దీనితో పాటు, యువత కూడా వారి ఆహారంలో పిస్తా పప్పులను చేర్చుకోవాలి.
డయాబెటిస్ వారికి ఉపయోగం
డయాబెటిస్‌తో బాధపడేవారికి పిస్తా కూడా సమర్థవంతమైనదని రుజువైంది. జీవ క్రియ పరిస్థితిని మెరుగుపరిచే లక్షణం పిస్తా పప్పుకు ఉంది. టైప్ -2 డయాబెటిస్ వారికి పిస్తా బాగా పని చేస్తుంది. అందువల్ల డయాబెటిస్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా పిస్తా తినవచ్చు. రాత్రి పూట కూడా పిస్తా తినవచ్చు.
కొలెస్ట్రాల్‌ను బ్యాలెన్స్ చేస్తుంది
పిస్తా తింటే కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. పిస్తా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ సమతుల్యతను కాపాడుకోవడానికి పని చేస్తాయి. కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు.
సమతుల్య మొత్తం గుండె జబ్బులకు గురికాకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.
మెదడు పనితీరు చురుకు
పిస్తాకు న్యూరో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంటుంది. మెదడు పని సామర్థ్యానికి ఇది చాలా బాగా పని చేస్తుంది. కాబట్టి రోజూ నాలుగైదు పిస్తా పప్పులు తీసుకుంటే అది మెదడు పని తీరు బాగుంటుంది. మెదడు సంబంధిత సమస్యల నుంచి కాపాడుకోగలుగుతాం.
రెండు గుప్పెళ్ల పిస్తా పప్పులు క్రమం తప్పకుండా 12 వారాల పాటు పిస్తా పప్పును తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గినట్లు సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు వీటిని నిత్యం తింటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘ABP దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.