ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమేపీ తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 23 వేల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 310 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,54,667కు చేరుకుంది. నిన్న ఒక్కరోజులో ఇద్దరు కరోనాతో పోరాడుతూ చనిపోయారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,256కు చేరుకుంది.
ఏపీలో నమోదైన మొత్తం 20,54,667 కరోనా పాజిటివ్ కేసులకు గాను, ఇప్పటివరకూ 20,33,153 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు దిగిరాగా, ప్రస్తుతం 7,258 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,87,67,963 (2 కోట్ల 87 లక్షల 67 వేల 963) శాంపిల్స్ కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజులో 23,022 శాంపిల్స్ పరీక్షించారు.
Also Read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు
ఏపీలో కరోనా రికవరీ భేష్..
నిన్న 310 మంది కరోనా బారిన పడగా, అంతకు మూడురెట్లు కొవిడ్ బాధితులు కోలుకున్నారు. ఆదివారం 994 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్19 వల్ల చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ఫాబ్రికేటెట్ మెటీరియల్‌తోనూ ఆసుపత్రులకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Also Read: సొరకాయ జ్యూస్‌తో... యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చెక్... సొరకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలి?
ఏపీలో అత్యధికంగా గుంటూరులో 54, నెల్లూరులో 51, చిత్తూరులో 45, విశాఖపట్నంలో 42 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా అనంతపురంలో ఇద్దరు, కర్నూలు, విజయనగరంలో నలుగురు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురికి కరోనా సోకింది.