కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఆ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ప్రస్తుతానికి మాత్రం సినిమాలకు పరిమితమయ్యారు. దీంతో ఆయన తన రాజకీయ ఆలోచనలను పక్కన పెట్టేసినట్లు కథనాలు వచ్చాయి. ఆ వార్తలను విశాల్ ఖండించాడు. సరైన సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని ప్రకటించాడు.
పూర్తి స్థాయి రాజకీయాలపై తనకు ఎలాంటి ప్లాన్స్ లేవని.. ఈ టైమ్ లో ఇలానే చేయాలని ఏదీ అనుకోలేదని.. పైన దేవుడు అనుగ్రహించాలి.. కింద భూమిపై పరిస్థితులు అనుకూలించాలని అన్నారు. ఈ రెండూ కలిసొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా తన రాజకీయ ప్రస్థానం మొదలవుతుందని.. ప్రస్తుతానికైతే తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని అన్నారు. ఇలా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు విశాల్.
గతంలో విశాల్ తమిళనాడు అసెంబ్లీయే ఎన్నికల్లో ఆర్కేనగర్ స్థానం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అయితే ఆఖరి నిమిషంలో తన నామినేషన్ ను ప్రతిపాదించిన పది మందిలో కొందరు మద్దతు ఉపసంహరించుకోవడంతో విశాల్ వేసిన నామినేషన్ ను ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. దీంతో విశాల్ పోటీ చేయలేకపోయారు. అయితే తను రాజకీయాల నుంచి తప్పుకోలేదని.. ఏదో ఒక సమయంలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తానని క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో. ఇటీవల విశాల్ నటించిన 'ఎనిమీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది.
Also read: ‘సూర్యవంశీ’ స్క్రీనింగ్ ను అడ్డుకున్న రైతులు... కేంద్రం మీద ఉన్న కోపం అక్షయ్‌పై చూపించారుగా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి