సినీ ఇండస్ట్రీలోనే కాదు.. బుల్లి తెర మీద ఎన్నో లవ్ ట్రాకులు నడుస్తూ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. సీరియల్ నటుల మధ్య ప్రేమాయణం నిజం కాకపోయినా వారిద్దరూ కలిసి తిరిగినా చాలు.. పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్లు వచ్చేస్తాయి. అలా సీరియల్లో నటిస్తూ బ్యూటీఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న జంట నవ్య స్వామి, రవి కృష్ణ. ప్రేమ కహానీతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది ఈ జంట. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఆమె కథ (స్టార్ మాలో ప్రసారం అయ్యింది). ఈ సీరియల్ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్టు పుకార్లు షికార్లు చేశాయి. కానీ అవన్నీ రుమార్సే అని కొట్టి పడేసింది నవ్య స్వామి. కానీ తాజాగా తన మనసులో ప్రేమ మరోసారి బయటపెట్టింది.


ఇటీవల ఓ టీవీ ఛానెల్ లో ప్రసారమైన లేడీస్ అండ్ జెంటిల్మెంట్ ప్రోగ్రామ్ లో నవ్య తన ప్రేమ విషయాన్ని చెప్పేసింది. ప్రోగ్రామ్ లో భాగంగా ఇద్దరు కలిసి రొమాంటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. తర్వాత నవ్య చాలా క్యూట్ గా రవికృష్ణ కి ప్రపోజ్ చేసింది. చేతిలో ఎర్ర గులాబీ పట్టుకుని సిగ్గు పడుతూ మనసులో మాట చెప్పకనే చెప్పేసింది. చాలా విషయాలు నాకు తెలిసినవి ప్రేక్షకులకు తెలుసా లేదా అనే డౌట్ ఉందని యాంకర్ ప్రదీప్ అంటాడు. “నువ్వు వచ్చాక నేను వ్యక్తిగతంగా చాలా మారాను. నువ్వే నా ప్రపంచం. నీకోక మాట చెప్పాలి” అనేసి గులాబీ చేతిలో పట్టుకుని “ఐ లవ్యూ రవి” అని చెప్పింది. అది విని రవి సంతోషంగా తన చేతిలోని గులాబీ పువ్వు తీసుకుని నవ్యని కౌగలించుకున్నాడు. ఆ మూమెంట్లో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది.


ఆమె కథ సీరియల్ టైంలో వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటున్నారు అని టాక్ కూడా నడిచింది. వాటికి ఊతం ఇస్తూ ఈటీవీలో ప్రసారం అయిన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇద్దరికీ పెళ్లి కూడా చేసేశారు. ఆ షోలో ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు చనువుగా కూడా ప్రవర్తించారు. ఆ తర్వాత కూడా సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో కూడా ఇద్దరు జంటగా వచ్చి రొమాన్స్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరు రొమాన్స్ చేస్తూ నవ్య ప్రపోజ్ కూడా చేసేసింది. అయితే ఇదంతా షో టీఆర్పీ రేటింగ్ కోసమే అని అందరూ అంటున్నారు. ఈ మధ్య కాలంలో టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా బుల్లితెర జంటల మధ్య రొమాన్స్ చేయిస్తూ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ టాస్క్ లు చేస్తున్నారు. అలాంటిదే ఇది కూడా అని అందరూ అనుకున్నారు.


గతంలో ఇలా వచ్చిన రూమర్స్ పై నవ్య స్పందిస్తూ రవి, తను మంచి ఫ్రెండ్స్ అని తమ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఇది కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం మాత్రమే అని తన దృష్టి అంతా కెరీర్ మీదే ఉందని చెప్పింది. మోడల్ గా కెరీర్ స్టార్ చేసిన రవి కృష్ణ 'మొగలిరేకులు' సీరియల్ తో ఫేమస్ అయ్యాడు. తర్వాత 'వరూధిని పరిణయం' సీరియల్ లో హీరోగా నటించాడు. వీరిద్దరూ కలిసి డాన్స్ షోస్ చేస్తూ అందరి కళ్ళలో పడుతూనే ఉన్నారు.


Also Read : 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!


Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్