మనసులో ఏమి లేకపోతే సామ్రాట్ నా మాట వినవచ్చు కదా ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాడు అని అనసూయ మనసులో అనుకుంటుంది. అభి వచ్చి అనసూయని నేను చెప్పిన పని ఏం చేశావ్ నానమ్మ అని అడుగుతాడు. ఎవరినో పర్మిషన్ అడగటం కాదు నువ్వు అనుకున్నది చెయ్యి అని అన్నావ్ కదా అదే చేశాను అని అనసూయ అంటుంది. ‘కానీ తులసి మనసు బాధపెడుతున్నా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు కానీ తప్పలేదు. నా కొడుకునిచ్చి పెళ్లి చేసి తులసి జీవితం నాశం చేశాను. అయినా ఆ పిచ్చి తల్లి ఈ ముసలి ప్రాణాల కోసం ఆరాటపడుతుంది. సగం జీవితం నా కొడుకుని నమ్ముకుని నాశనం చేసుకుంది. మిగతా సగం మా కోసం వృధా చేసుకుంటుంది. అలా అని దాన్ని వదిలి వెళ్లలేము’ అని అనసూయ బాధ పడుతుంది.


అనసూయ, అభి మాట్లాడుకుంటూ ఉండగా తులసి వస్తుంది. మా మాటలు వినేసిందా ఏంటి అని అనుకుంటుంది కానీ ఏదో చెప్పి కవర్ చేస్తారు. రేపు నీకు ఆఫీసు ఉందా వెళ్తున్నావా అని అనసూయ అడుగుతుంది. సామ్రాట్ గారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు నిలబెట్టుకోవాలి కదా అని తులసి అంటుంది. సామ్రాట్ ని ఇంకోసారి కలిసి గట్టిగా చెప్తే కానీ లాభం లేదని అనసూయ మనసులో అనుకుంటుంది. అటు సామ్రాట్ ఇదే విషయాన్ని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. తన బాబాయ్ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావ్ నాకు చెప్పకూడడా అని అడుగుతాడు. తులసి కాల్ ఎందుకు కట్ చేశావ్ అని అడుగుతాడు. కానీ సామ్రాట్ మాత్రం ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతాడు.


Also Read: దిమ్మ తిరిగేలా షాకుల మీద షాకులిచ్చిన దీప- కార్తీక్ ముందు అడ్డంగా బుక్కైయిపోయిన మోనిత


తులసి ఒక ఫైల్ మీద సంతకం చేస్తుంటే లాస్య దొంగచాటుగా చూస్తుంది. ఒక ఫైల్ సామ్రాట్ గారు చూసే పంపించారు కదా అని పక్కన ఉన్న అమ్మాయి ఝాన్సీని అడుగుతుంది. అవును మేడమ్ అని చెప్పి ఆ ఫైల్ మీద తులసి సంతకం చేయిస్తుంది. సామ్రాట్ గారు నిన్ను ఎంత నమ్ముతున్నారో నేను నిన్ను అంతే నమ్ముతున్నా అని తులసి అంటుంటే అప్పుడే వచ్చిన సామ్రాట్ తనని చూసి కూడా ఆగకుండా వెళ్ళిపోతాడు. తులసి ఆఫీసులో వాళ్ళతో మాట్లాడుతుంటే నందు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. పాత ప్రాజెక్ట్ లో కంప్లైంట్ ఉందని రూ.10 కోట్లు పేమెంట్ కంపెనీ హోల్డ్ లో పెట్టింది దాని మీద మేనేజర్ గారు సంతకం పెట్టేశారని నందు అనేసరికి తులసి షాక్ అవుతుంది. అంత గుడ్డిగా ఎలా చేశావ్ తులసి అని లాస్య ని అడుగుతుంది. తెలియకే ఈ సైన్ చేశావా లేదంటే కావాలనే ఇలా చేశావా అని లాస్య అనుమానంగా అడుగుతుంది.


నేను చూడకపోతే కంపెనీకి రూ.10 కోట్లు నష్టం వచ్చి ఉండేది కదా అని నందు అంటుంటే సామ్రాట్ ఎంట్రీ ఇస్తాడు. లాస్య ఏదో చెప్పబోతుంటే ఆపి అంతా విన్నాను థాంక్యూ మిస్టర్ నందగోపాల్ మీకు సంబంధించిన ఫైల్ కాకపోయినా కంపెనీ మీద ఉన్న శ్రద్ధతో కాపాడారు. నాకు కావలసింది ఇలా సిన్సియారిటీ డెడికేషన్ అని సామ్రాట్ అంటాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని సామ్రాట్ తులసిని నిందిస్తాడు. లాస్య కూడా సందు దొరికిందని తులసిని తిడుతుంటే సామ్రాట్ సపోర్ట్ గా మాట్లాడటంతో షాక్ అవుతుంది. కంపెనీ డబ్బు పోతుందని అరిచాను సోరి తులసి అని నందు అంటాడు. తను తప్పు చేసిందని మరోసారి సామ్రాట్ అనేసరికి తులసి ఫీల్ అవుతూ సోరి చెప్తుంది. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాను మీ నమ్మకం నిలబెట్టుకుంటాను అని చెప్తుంది.


Also Read: ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర


ఝాన్సీ బాధపడుతూ ఉంటే తులసి వస్తుంది. ఆ ఫైల్ సామ్రాట్ గారు చూశారు అని నువ్వే చెప్పేసరికి నేను సైన్ చేశాను. నీ పొట్టకొట్టడం నాకు ఇష్టం లేదు. ఫైల్ విషయంలో నాకు ఎందుకు అబద్ధం చెప్పావు. నువ్వే చెప్పావా ఎవరైనా చెప్పించారా అని తులసి అడుగుతుంది.


తరువాయి భాగంలో..


హనీ బర్త్ డే  సెలెబ్రేషన్స్ లో సామ్రాట్ నందుని పొగుడుతాడు. అతని నమ్మకాన్ని మెచ్చి నందగోపాల్ గారిని తులసి గారి ప్లేస్ లో నియమిస్తున్నా అని సామ్రాట్ ప్రకటిస్తాడు. అది విని తులసి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోతుంది.