కార్తీక్ బాధగా దీప దగ్గర కూర్చుని ఉంటే శివ వస్తాడు. మేడమ్ మిమ్మల్ని ఒక రెండు గంటలు బయట తిప్పమని చెప్పారు సర్ అని శివ అనేసరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చే మూడ్ లేదని కార్తీక్ కోపంగా చెప్తాడు. అయినా నేను వెళ్ళాలి అనుకుంటే వెళ్తాను కానీ మీ మేడమ్ చెప్పినప్పుడు కాదని అంటాడు. అప్పుడే శివకి ఫోన్ వస్తుంది. ఎవరు ఫోన్ అని కార్తీక్ అడుగుతాడు. ఇంటికి వచ్చారె మేడమ్ ఫ్రెండ్ సర్ రెండు గంటలు ఇంటికి రావొద్దు సినిమాకు వెళ్ళమని డబ్బులు కూడ పంపిస్తానని చెప్పారు అనేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. దీప సైలెంట్ తన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందని సైలెంట్  గా నవ్వుకుంటుంది. కార్తీక్ కోపంగా కుర్చీని తన్నుతాడు.


ఏం జరుగుతుంది, ఇంతక ముందు కూడా ఇలాగే ఉండేదా నేను గతం మర్చిపోయి ఇలా ఉన్నాన్న అని కార్తీక్ ఇరిటేట్ అవుతాడు. ఏం కాదు అంతా మంచే జరుగుతుందని దీప సర్ది చెప్తుంది. క్షమించండి డాక్టర్ బాబు. భార్య కానీ భార్య కోసం మిమ్మల్ని బాధిస్తున్నా అని దీప ఫీల్ అవుతుంది. దుర్గ మోనిత ఇంటి ముందు పడుకుని పాటలు పాడుకుంటూ ఉంటాడు. అప్పుడే మోనిత రాడ్ తీసుకుని కొట్టడానికి వెళ్లబోతుంటే దుర్గ చూస్తాడు. ఏంటి బంగారం రాడ్ తీసుకున్నావ్ తల పగలగొట్టి చంపేద్దామని అనుకుంటున్నావా అని అంటాడు. నాగురించి తెలిసి కూడా ఇలా అంటావెంటీ మోనిత అమాయకంగా అడుగుతుంది.


Also Read: మోనితపై కార్తీక్ కి మొదలైన అనుమానం, దీపకు అభయం ఇచ్చిన దుర్గ


తెలుసు బంగారం పైకి పంపించడం మనకి కొత్త కాదు కదా ఒకవేళ అలాంటిది ఏమైనా చేస్తే నేను చెప్పిన అబద్దాలు అన్నీ నిజం చేసినట్టే అని దుర్గ అంటాడు. చంపేయాలనేంత కోపంగానే ఉంది రా కానీ నువ్వు చెప్పిన ఒక్క కారణంతో ఆగిపోతున్నా అని మోనిత అంటుంది. నీకు దణ్ణం పెడతాను నన్ను వదిలి వెళ్లిపో అని చెప్తుంది. కార్తీక్ సార్ వంటలక్క ఇంట్లో దూరారు అని దుర్గ అనేసరికి మోనిత కోపంగా వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక నీకు ఉంటదిలే పో అని అనుకుంటాడు.


కార్తీక్: ఈరోజు నాకు తెలిసిన నిజం రేపు కాలనీ మొత్తం తెలిసిపోతుంది. నేను ఒడిపోయాను. మోనిత ఇంత పని చేస్తుందని అనుకోలేదు


మోనిత: ఏంటి కార్తీక్ దీప దగ్గర తెగ బాధపడిపోతున్నాడు. నేను మోసం చేశానా


దీప: డాక్టర్ బాబు మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు


కార్తీక్: కళ్ల ముందు ఇంత జరుగుతుంటే ఏడేదో ఊహించుకోవడం ఏంటి


మోనిత: ఈ దుర్గ, దీప కలిసి ఏదో చేస్తున్నారు


కార్తీక్: ఇద్దరు రాసుకు పూసుకు తిరుగుతున్నా అంతకమించి ఏమి ఉండదులే అని నాకు నచ్చజెప్పుకున్నా చూడు అది అపోహ


మోనిత: అర్థం అయ్యింది దుర్గకి నాకు మధ్య ఏదో ఉన్నట్టు అనుమానం క్రియేట్ చేస్తున్నారు


దీప: నాకు అనుమానం వచ్చింది కానీ తెలిసిన వాళ్ళని అందుకే నేను కూడా మీలాగే ఏమి ఉండదని అనుకున్నా


మోనిత: వాడు ఏదో నిప్పు రాజేస్తే ఇది తీరికగా కూర్చుని నెయ్యి పోస్తుంది. ఇంతకీ ఏంచెప్పి కార్తీక్ కి అనుమానం వచ్చేలా చేస్తున్నారు


కార్తీక్: అంత చూస్తూనే ఉన్నాం ఇంకా అపోహ అని ఎలా అనుకుంటాం. మోనితేమో శివని పంపించి రెండు గంటలు సార్ ని బయటకి తీసుకెళ్లమని చెప్పింది.. సరే మోనిత ఎప్పుడు బయటకి తీసుకెళ్లామన్నట్టే ఇప్పుడు తీసుకెళ్లమన్నది అనుకుందాం కానీ అప్పుడే ఆ దుర్గ శివకి ఫోన్ చేసి రెండు గంటలు సినిమాకి పొ అని డబ్బులు ఎందుకు పంపించాడు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండి నన్ను బయటకి పంపమని చెప్పడంలో అర్థం ఏంటి


మోనిత: ఒరేయ్ దుర్గ ఇంత పని చేశావా అయిపోయావ్ నా చేతిలో అని కోపంగా వెళ్ళిపోతుంది.


Also Read: ప్రాజెక్ట్ పేరుతో మళ్లీ ఒక్కచోట చేరిన ప్రియమైన శత్రువులు రిషిధార


దుర్గని చంపేద్దామని మోనిత ఇంజెక్షన్ చేసే టైమ్ కి కార్తీక్, దీప ఇంటికి వస్తారు. నేను అనుకున్నట్టు ఏమి కాదు అన్నావ్ గా అని కార్తీక్ అనడం విని మోనిత కంగారుగా ఇంజెక్షన్ విసిరేస్తుంది. రా కార్తీక్ అని మోనిత కంగారుగా పిలుస్తుంది. దేవుడా ఇలా ఇరుక్కుపోయాను ఏంటి రా మోనిత మనసులో అనుకుంటుంది. నువ్వు అనుకున్నది ఏది నిజం కాదు అని మోనిత బతిమలాడుతుంటే దీప చాటుగా నవ్వుకుంటుంది. నన్ను కార్తీక్ దగ్గర బ్యాడ్ చెయ్యడానికి సిగ్గు లేదా అని మోనిత అనేసరికి దీప సీరియస్ అవుతుంది. పదేళ్ళ క్రితం నువ్వు చేసింది ఏంటి అని దీప అంటుంది.


తరువాయి భాగంలో..


మోనిత కార్తీక్ దగ్గర కూర్చుని మాట్లాడుతుంది. అసలు అతను ఎవరు? నీకు అతనికి సంబంధం ఏంటి అని కార్తీక్ మోనితని అడుగుతాడు. నేను ఏ తప్పు చెయ్యలేదు కార్తీక్ నన్ను నమ్ము అని మోనిత ఏడుస్తూ చెప్తుంటే కార్తీక్ కి గతంలో దీప ని అనుమానించినది మసకగా కనిపిస్తుంది.