రిషి రెస్టారెంట్లో కూర్చుని వసు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చి ఇంతసేపు అయ్యింది ఇంకా రాలేదు ఈ వసుధార కావాలని లేట్ చేస్తుందా అని రిషి మనసులో అనుకుంటాడు. తర్వాత వసు రిషికి కాఫీ తీసుకొచ్చి ఇస్తే కూర్చోమని చెప్తాడు. కాఫీ ట్రేలో షేర్ చేసి వసుకి ఇస్తాడు. మానేయవచ్చు కదా అని రిషి అడుగుతాడు.


వసు: కాఫీనా సర్


రిషి: కాదు కాఫీలు అందించే ఉద్యోగం. మినిస్టర్ గారు ఏమన్నారో విన్నావ్ కదా నువ్వు సివిల్స్ రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతావు


వసు: సివిల్స్ గొప్పదే కాదు అనను కానీ మొదటి నుంచి నాకొక లక్ష్యం ఉంది డాక్టర్, లాయర్, కలెక్టర్.. వీళ్లందరిని తయారు చేసేది టీచర్. అందుకే నాకు టీచర్ వృత్తి అంటే నాకు ఇష్టం గౌరవం. మిగిలిన ప్రిన్సిపాల్ కి ఉండే గౌరవం వాటికి ఉంటుంది. కానీ నాకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం.. నేను పంతులమ్మ అవుతాను సర్


రిషి: మధ్యలో మన జీవిత లక్ష్యాలు మార్చుకోవచ్చు అందులో ఏముంది?


వసు: సార్ నేను ఒక వృత్తిని ప్రేమించాను దాన్ని మార్చుకొను. అలాగే నేను ఒక వ్యక్తిని కూడా ప్రేమించాను అది మారదు. ఈ వసుధార ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది


రిషి: బాగుంది.. అదే కాఫీ.. ఇందాక నువ్వు అన్నావ్ చూడు ఏది మార్చుకొను అని కానీ జీవితం అన్నాక కొన్ని మార్చుకోవాలి. అభిప్రాయాలు మార్చుకొనక్కర్లేదు కొన్ని ఆలోచనలు మార్చుకోవాలి అంటున్నా


వసు: కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడే మార్చుకోకూడదు అనుకున్నా సర్ దాన్ని ఎలా మార్చగలం


రిషి: నువ్వు మొండిదానివి వసుధార


వసు: మంచిదాన్ని కూడా సర్


రిషి: జగతి మేడమ్ విషయంలో వసుధార మనసు మారదు


Also Read: దిమ్మ తిరిగేలా షాకుల మీద షాకులిచ్చిన దీప- కార్తీక్ ముందు అడ్డంగా బుక్కైయిపోయిన మోనిత


జగతి మేడమ్ ని రిషి సర్ అమ్మా అని పిలవరా.. నన్ను మొండిదాన్ని అంటారు కానీ నిజానికి రిషి సర్ మొండిఘటం. రేపు కాలేజీకి వస్తున్నావా అని రిషి అడిగితే రమ్మంటారా అని వసు ఆత్రంగా అడుగుతుంది. రిషి బై చెప్పేసి వెళ్ళిపోతాడు.


రిషి రావడం చూసి దేవయాని నాటకం స్టార్ట్ చేస్తుంది. ఏంటి ధరణి మహేంద్ర, జగతి ఇంకా భోజనానికి రాలేదా నా మీద అలిగారా ఏంటి అని దేవయాని అడుగుతుంది. అది విని రిషి వెనక్కి వచ్చి ఏంటి పెద్దమ్మా మీ మీద అలగడం ఏంటి అని అడుగుతాడు. ఏం లేదులే రిషి అని దేవయాని కావాలని అంటుంటే ఏమైందని పదే పదే అడుగుతాడు. ఈ ఇంటి పెద్దదానిగా మాట అంటాను దానికి సమాధానం ఇవ్వాలి అంతే కానీ నా గుండె ముక్కలు అయ్యే మాటలు మాట్లాడితే బాధగా ఉంటుంది కదా అని ఏడుస్తుంది. అదంతా మహేంద్ర చూస్తూ ఉంటాడు. వసు కాలేజీకి వచ్చిందంట కదా ఎందుకు వచ్చిందని అడిగాను దానికి మహేంద్ర ఏమన్నాడో తెలుసా అంటే వదినగారు ఎందుకు ఏడుస్తున్నారని మహేంద్ర అంటాడు.


నీ గురించి వసుధార గురించి అడుగుతుంటే నా కొడుకు గురించి నీకు ఎందుకు అన్నారని ఏడుస్తూ చెప్తుంది. వదినగారు మీరు ఇలా మాట్లాడటం ఏమి బాగోలేదని మహేంద్ర అంటే డాడ్ మీరు ఏం మాట్లాడకండి అని రిషి సీరియస్ అవుతాడు. నువ్వు నా కొడుకువి కాదు కదా అందుకే ఇలా అంటున్నారు, నిన్ను ఎప్పుడైనా పరాయి వాడిలా చూశానా అని ఎదుస్తున్నట్టు నటిస్తుంది. డాడ్ పెద్దమ్మని అంత మాట అన్నారా అని రిషి కోపంగా అడుగుతాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకో అని మహరేణద్ర చెప్తుంటే రిషి మాత్రం వినకుండా ఉంటుంటే జగతి ఆపుతుంది. ఏంటి మేడమ్ డాడ్ చెప్తుంటే మీరు ఆపుతున్నారా? డాడ్ ని కంట్రోల్ చేస్తున్నారా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు.


Also Read: ప్రాజెక్ట్ పేరుతో మళ్లీ ఒక్కచోట చేరిన ప్రియమైన శత్రువులు రిషిధార


నిజం చెప్పండి పెద్దమ్మని ఏమన్నారు? నా కొడుకు నా ఇష్టం మీకెందుకు అన్నారా అని రిషి అడుగుతాడు. పెద్దమ్మకి సోరి చెప్పమని రిషి మహేంద్రతో అంటాడు. పెద్దమ్మకి మన ఇంట్లో ఇంత పెద్ద అవమానం జరుగుతుందని నేను అనుకోలేదు ఒక్క మాట సోరి చెప్పండి ఇంకేమీ అడగను అని చెప్తాడు. కానీ నేనేమీ తప్పు చేయలేదని మహేంద్ర అనడంతో రిషి సీరియస్ గా అన్నం తినకుండా వెళ్తూ జరిగిన దానికి నేను మీరు సోరి చెప్తున్నా అనేసి వెళ్ళిపోతాడు. మహేంద్ర కోపంగా సోరి వదిన గారు అని చెప్తాడు. నా కొడుకు కోసం ఎన్ని మెట్లు అయినా దిగుతాను ఎన్ని సోరి లు చెప్పమన్నా చెప్తాను వాడిని పిలవండి నా కొడుకు ఆకలిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు పిలవండి వాడిని అని బతిమలాడతాడు.


దేవయాని వెళ్ళి రిషిని భోజనానికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. మహేంద్ర మాత్రం తినకుండా వెళ్తుంటే రిషి చెయ్యి పట్టి ఆపి నా మీద కోపం వచ్చిందా మీరు తినకుండా వెళ్తే నేను ఎలా తింటాను డాడ్ అని రిషి అంటాడు. జగతిని కూడా కూర్చోమని చెప్తాడు. పెద్దమ్మ విషయంలో నేనేమైనా కఠినంగా వ్యవహరిస్తే నన్ను క్షమించండి డాడ్.. పెద్దమ్మ  బాధపడితే నేను చూస్తూ ఉండలేను అని రిషి చెప్తాడు. మహేంద్ర మాత్రం చాలా బాధపడతాడు. అప్పుడే దేవయాని వసు గురించి మాట్లాడుతుంటే రిషికి ఫోన్ చేస్తుంది. తర్వాత వసు గురించి పొగుడుతూ ఉంటాడు. అది విని దేవయాని రగిలిపోతుంది. వసు, రిషి ఇద్దరు ఫోన్స్ లో ఫోటోస్ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు.