వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున స్టైలిష్ గా రెడీ అయి బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చేశారు. దసరా స్పెషల్ ఎపిసోడ్ కావడంతో హౌస్ మేట్స్ తో స్పెషల్ గేమ్స్ ఆడించడానికి రెడీ అయ్యారు నాగార్జున. 


శ్రీహాన్ సేఫ్: నామినేషన్స్ లో ఉన్న పది మందికి కొబ్బరికాయ టాస్క్ ఒకటి ఇచ్చారు. ఇందులో శ్రీహాన్ కి మాత్రమే సేఫ్ అని వచ్చింది.


గీతూకి నాగార్జున క్లాస్:


నిన్న జరిగిన ఎపిసోడ్ లో గేమ్ సరిగ్గా ఆడని ఆదిరెడ్డి, బాలాదిత్య, చంటి, ఇనయాలలో ఒకరిని ఎన్నుకోమని హౌస్ మేట్స్ ని అడిగారు నాగార్జున. అందరికంటే ఎక్కువ ఓట్లు చంటికి రావడంతో.. ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ పోటీకి అతడి అర్హత రద్దు చేయబడిందని చెప్పారు. కీర్తి తన ఓటు చంటికి వేయడంతో అతడికి ఈ శిక్ష పడింది. చంటికి కీర్తికి మధ్య చిన్న మిస్ కమ్యూనికేషన్ జరగడంతో.. దాన్ని ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు. కీర్తి కెమెరాల కోసం పని చేస్తుందని చంటి అన్న మాటలను గీతూ తప్పుగా కన్వే చేయడంతో అసలు గొడవ మొదలైంది. దీంతో నాగార్జున వీడియో వేసి చూపించారు. చంటి తప్పుగా అనలేదని.. ఒక చిన్న పదం వలన మీనింగ్ మారిపోయి పెద్ద గొడవలు జరుగుతున్నాయని.. అలా జరగకుండా చూసుకోమని నాగార్జున చెప్పారు. ఈ క్రమంలో గీతూకి నాగార్జున క్లాస్ పీకారు. దీంతో ఆమె ఏడ్చేసింది. 


హౌస్ లో 'ది ఘోస్ట్' టీమ్:


నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా హీరోయిన్ సోనాల్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు స్టేజ్ పైకి వచ్చారు. గెస్ట్ లు హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో ఘోస్ట్ గేమ్ ఆడించారు నాగార్జున. హౌస్ లో ఉన్న ఈవిల్ ఎవరో.. వారిని షూట్ చేయాలని చెప్పారు. ఇందులో ఫైమా.. కీర్తిని, గీతూ.. చంటిని.. ఆదిరెడ్డి.. రేవంత్ ను, రేవంత్.. కీర్తిను, కీర్తి.. రేవంత్ ను, చంటి.. రేవంత్ ను, ఆర్జే సూర్య.. ఆరోహిను, రాజ్.. గీతూని, మెరీనా.. గీతూని, ఆరోహి.. ఇనయాను, ఇనయా.. శ్రీహాన్ ను, సుదీప.. బాలాదిత్యను, బాలాదిత్య.. గీతూని, అర్జున్.. శ్రీసత్యను, శ్రీహాన్.. కీర్తిను, శ్రీసత్య.. ఆర్జే సూర్యను షూట్ చేశారు. 


ఇనయా సేఫ్: నామినేషన్స్ లో మిగిలిన తొమ్మిది కంటెస్టెంట్స్ కి పూలబుట్టల టాస్క్ ఒకటి ఇవ్వగా.. ఇందులో ఇనయా సేఫ్ అయింది.


ఆ తరువాత హౌస్ మేట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించారు. 


గీతూ సేఫ్: నామినేషన్స్ లో మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్స్ కి  గంట టాస్క్ ఇవ్వగా.. అందులో గీతూ సేఫ్ అయింది. 


ఆర్జే సూర్య సేఫ్: నామినేషన్స్ లో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ చేతిలో టిఫిక్ బాక్స్ లు పెట్టారు. అందులో మిఠాయి ఉంటే సేఫ్ అని.. చిల్లీ ఉంటే నాట్ సేఫ్ అని చెప్పారు. ఈ టాస్క్ లో ఆర్జే సూర్యకి మిఠాయి రావడంతో అతడు సేఫ్ అయ్యాడు. 


ఆ తరువాత హౌస్ మేట్స్ తో మిఠాయి టాస్క్ ఆడించారు నాగార్జున. స్వీట్ లడ్డు, బిట్టర్ లడ్డులు ఇచ్చి.. ఎవరికి ఏ లడ్డు తినిపిస్తున్నారో చెప్పమని అన్నారు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కరూ తమ రీజన్స్ చెప్పి మిగిలిన వాళ్లకు లడ్డులు తినిపించారు. 


కీర్తి, అర్జున్ సేఫ్: నామినేషన్స్ లో మిగిలిన ఐదుగురికి పాలపిట్ట టాస్క్ ఇవ్వగా.. అందులో కీర్తి, అర్జున్ సేఫ్ అయ్యారు. 


అమ్మాయి అబ్బాయిలకు మధ్య బల పరీక్ష పెట్టారు. ఇందులో రాజశేఖర్‌తో ఫైమా పోటీ పడింది. రాజశేఖర్ ఒక చేయి వాడితే, ఫైమా మాత్రం రెండు చేతులు వాడింది. ఇక రేవంత్, గీతూ మధ్య పోటీ జరిగింది. తరువాత శ్రీసత్య - అర్జున్ కళ్యాణ్ పోటీపడ్డారు. శ్రీసత్య 'నువ్వు ఇప్పుడు ఓడిపోతే రాత్రి నీకు అన్నం తినిపిస్తా' అంది. అంతే వెంటనే ఓడిపోయాడు అర్జున్.    


రాజ్ సేఫ్: నామినేషన్స్ లో మిగిలిన సుదీప, ఆరోహి, రాజ్ లలో.. రాజ్ కి సేఫ్ వచ్చింది. 


ఆరోహి ఎలిమినేషన్: ఫైనల్ గా నామినేషన్ లో మిగిలిన సుదీప్, ఆరోహిలలో.. ఆరోహి ఎలిమినేట్ అయిందని ప్రకటించారు నాగార్జున. 


ఆరోహి ఎలిమినేషన్ ఊహించని హౌస్ మేట్స్ షాకయ్యారు. ఇనయా, కీర్తి, ఆర్జే సూర్య బాగా ఏడ్చారు. స్టేజ్ పైకి వెళ్లిన ఆరోహికి తన జర్నీ వేసి చూపించారు. ఆమెకొక టాస్క్ ఇచ్చారు నాగార్జున. స్వచ్ఛం, కల్మషం అనే టాస్క్ ఇచ్చి.. హౌస్ లో స్వచ్ఛమైన వారు ఎవరు, కల్మషం ఉన్న వారెవరని అడిగారు. శ్రీహాన్, బాలాదిత్య, కీర్తి, ఆర్జే సూర్య, వసంతి, మెరీనా రోహిత్ లను స్వచ్ఛమైన మనుషులని.. రేవంత్, చంటి, సుదీప, శ్రీసత్య, ఇనయా, గీతూలకు కల్మషం ట్యాగ్ ఇచ్చింది. 


Also Read: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!


Also Read: ప్రభాస్, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో త్రివిక్రమ్ సినిమాలు - రివీల్ చేసిన నిర్మాత!