IND Vs SA 2nd T20 Toss: ఈసారి టాస్ దక్షిణాఫ్రికాది - బౌలింగ్‌కు మొగ్గు చూపిన ప్రొటీస్!

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

Continues below advertisement

భారత్‌తో జరుగుతున్న రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదటి టీ20లో విజయం సాధించిన భారత్ ఈ సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే 2-0తో సిరీస్ మన సొంతం కానుంది. కాబట్టి ఈ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ఈ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఒక మ్యాచ్ ముందే సిరీస్‌ను సొంతం చేసుకుంటే చివరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. మొదటి టీ20 ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగింది. ఎటువంటి మార్పులూ చేయలేదు. దక్షిణాఫ్రికా ఒక మార్పు చేసింది. షంసి స్థానంలో లుంగి ఎంగిడి జట్టులోకి వచ్చాడు.

Continues below advertisement

టీమిండియా తుదిజట్టు
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

దక్షిణాఫ్రికా తుదిజట్టు
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బవుమా (కెప్టెన్), రిలీ రౌసో, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఆన్రిచ్ నోకియా, లుంగి ఎంగిడి

Continues below advertisement