మూడు వన్డేల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు భారత్, దక్షిణాఫ్రికా సిద్ధం అయ్యాయి. సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోనున్నారు.


భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభం అవుతుంది?
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ ఈరోజు రాత్రి 7:00 గంటలకు గువాహటిలోని బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ ప్రారంభం కావడానికి అరగంట ముందు అంటే రాత్రి 6:30 గంటలకు టాస్ వేయనున్నారు.


ఇండియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి?
ఇండియా vs దక్షిణాఫ్రికా మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్‌డీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో కూడా ఈ మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.


టీమిండియా కూర్పు పటిష్టంగానే కనిపిస్తోంది. రోహిత్, రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగబోతున్నారు. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. విరాట్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫాంలో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్ లో పంత్, దినేష్ కార్తీక్ రూపంలో మంచి హిట్టర్లు ఉన్నారు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. పేస్ విభాగాన్ని హర్షల్ పటేల్ నడిపించనున్నాడు. అతనితో పాటు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్ ఉండనున్నారు.