దర్శకుడు త్రివిక్రమ్(Trivikram)తో పరిమితిలేని బడ్జెట్ లో, ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాంటి సినిమా చేయాలనే కోరిక ఉందని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత, హారిక హాసిని సంస్థ నిర్వాహకులు సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ప్రస్తుతం ఈయన నిర్మించిన 'స్వాతిముత్యం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు నాగవంశీ. 'స్వాతిముత్య' సినిమా స్పెర్మ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించామని.. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా సినిమా ఉంటుందని చెప్పారు.
ఇకపై అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే ప్లాన్ చేస్తున్నట్లు.. దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేయబోతున్నామని చెప్పారు. త్రివిక్రమ్ తో ఎప్పటికైనా హాలీవుడ్ రెం సినిమా చేయాలనేది తన కోరిక అని అన్నారు. అది ఎలాంటి సినిమా, ఎవరితో ఉంటుందనేది టైమ్ వచ్చినప్పుడు డిసైడ్ చేస్తామని అన్నారు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రభాస్(Prabhas), రామ్ చరణ్(Ram Charan)లతో సినిమాలు చేసే ఆలోచన ఉందన్నారు.
మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తోన్న సినిమా కొత్త ఉంటుందని.. ఈ సినిమా మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ఇంకా అంచనా లేదన్నారు. ఇదే సమయంలో మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకున్న మాట నిజమేనని.. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని.. త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు నాగవంశీ. ఆయన ఇంకా ఈ విషయంపై డెసిషన్ తీసుకోలేదని చెప్పారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' రెండూ థియేటర్లో అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయని.. కానీ టీవీలో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయని చెప్పారు. ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. వాటిని మించి సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు నాగవంశీ. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి!
'అయోధ్యలో అర్జునుడు':
ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా టైటిల్ ప్రచారంలోకి వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం ఈ టైటిల్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు ఇద్దరి సెంటిమెంట్ కలగలిసేలా 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదివరకు త్రివిక్రమ్ సినిమాల టైటిల్ విషయంలో ఏం జరిగేదో అందరికీ తెలిసిందే. ఒక టైటిల్ ను వారే క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేవారు. ఆ టైటిల్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి టైటిల్ మార్చడమా..? ఫైనల్ చేయడమా..? అనే విషయంలో నిర్ణయం తీసుకునేవారు. మరిప్పుడు 'అయోధ్యలో అర్జునుడు' టైటిల్ ను ఫైనల్ చేస్తారో లేదో చూడాలి!

Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్
Also Read : యాక్షన్ విత్ మెసేజ్, అంతా యునైటెడ్ కింగ్‌డమ్‌లో - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు