జానకి చదువుకుంటుందో లేదో అని రామా ఫోన్ చేస్తాడు. మీరు నాకు దూరంగా ఉండటానికి నేను మీకు శక్తిని ఇచ్చాను కదా మరి నేను చదువుకోవడానికి శక్తిని ఇవ్వరా అని జానకి వీడియో కాల్ లో అడుగుతుంది. నేను కొట్టులో ఉన్నాను అవేమీ కుదరవు చదువుకోండి అని రామా అంటే మీరు ఇస్తేనే చదువుకుంటా అంటుంది. రామా ఫోన్లో ముద్దు పెడతాడు. అది చూసి జానకి మురిసిపోతుంది. వెన్నెల తనకి సబ్జెక్ట్ లో డౌట్స్ ఉన్నాయని జానకి దగ్గరకి వస్తుంది. ఎలాగైనా నువ్వే చెప్పి నన్ను గట్టెక్కించమని అడగటంతో జానకి తన చదువు ఆపేసి వెన్నెలకి చెప్తుంది.
ఇక ఇంట్లో అందరూ ఒక చోట నిలబడి టెన్షన్ గా ఉంటారు. ఏదో చెప్పాలి అని అందరినీ పిలిచావ్ అని గోవిందరాజులు జ్ఞానంబని అడుగుతాడు. రేపటి నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. నేను ఎంత నిష్టగా ఉంటానో మీరందరూ కూడా అలాగే ఉండాలి తేడా వస్తే అసలు సహించను. కొత్తగా ఉన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ఉంటే మంచిది అని జ్ఞానంబ చెప్తుంది. అమ్మవారి పూజ జరిగే ఈ తొమ్మిది రోజులు ఇంట్లో గాని బయట గాని మాంసాహారం తింటే నేను వేసే శిక్ష చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరిస్తుంది. అమ్మా మల్లిక ఇది నీకే అని గోవిందరాజులు సెటైర్ వేస్తాడు. రేపటి నుంచి పొద్దున్నే స్నానాలు చేసి అందరూ భక్తి శ్రద్ధలతో ఉండండి అని చెప్తుంది.
Also Read: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి
అత్తయ్యగారి పూజకీ ఏ ఆటంకం రాకుండా చూడాలి అలాగే త్వరలో రానున్న మెయిన్స్ కి కూడా బాగా చదువుకోవాలి అని జానకి మనసులో అనుకుంటుంది. ఇటు వాటిని చెడగొట్టాలని మల్లిక అనుకుంటుంది. రాత్రి వేళ జానకి నిద్రపోకుండా చదువుకుంటుంటే రామా లేచి అదేంటి అని అడుగుతాడు. ఇప్పుడు చదువుకుంటేనే తర్వాత హాయిగా నిద్రపోతాను అంటుంది. రామా అది చూసి సంతోషిస్తాడు. జానకి నిద్ర వచ్చి ఇబ్బంది పడుతూనే చదువుకుంటుంది. పగలంతా ఇంటి పనుల వల్ల సరిగా చదవలేకపోయాను ఇప్పుడు కూడా చదవకపోతే నేను ఎగ్జామ్స్ సరిగా రాయలేను అని జానకి అనుకుంటుంది. తెల్లారే వరకు జానకి చదువుకుంటూనే ఉంటుంది.
ఇక ఉదయాన్నే ఇంట్లో శరన్నవరాత్రులు పూజ మొదలవుతుంది. అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకుని జానకి ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. బయట రామా తన కోసం టెన్షన్ గా ఎదురుచూస్తూ ఉంటాడు. పరీక్ష బాగా రాశారా అని ఆత్రంగా అడుగుతుంటే కాసేపు రామాగారిని ఆట పట్టించాలని జానకి డ్రామా వేస్తుంది. అంత దిగులుగా చెప్తున్నారు ఏంటి అందుకే చెప్పాను ఇంటి పనులు పక్కన పెట్టి చదువుకోమని రామా ఫీల్ అవుతుంటాడు. మీరు పరీక్ష బాగా రాయలేదని అమ్మ కూడా ఫీల్ అవుతుందని అంటాడు. అప్పుడే కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చి ఎగ్జామ్ లో 10/10 మార్కులు వచ్చాయని చెప్తుంది. ఎన్ని మార్కులకి పరీక్ష పెడితే అన్నీ మార్కులు వచ్చాయని రామాతో చెప్తుంది.
Also Read: దిమ్మ తిరిగేలా షాకుల మీద షాకులిచ్చిన దీప- కార్తీక్ ముందు అడ్డంగా బుక్కైయిపోయిన మోనిత
నవరాత్రుల తర్వాత మెయిన్స్ ఉన్నాయి అవి కూడా ఇలాగే బాగా రాస్తే నువ్వు ఐపీఎస్ అయినట్టే అని ఆమె చెప్పి వెళ్ళిపోతుంది. పరీక్ష బాగా రాయలేదని నన్నే ఆటపట్టిస్తారా అని రామా తన వెంట పడతాడు. సంతోషంతో జానకిని ఎత్తుకుని తిప్పేస్తాడు. అందరు మనలనే చూస్తున్నారని జానకి అనేసరికి దింపుతాడు. రామా సంతోషంగా ఇంటికి వస్తాడు. అమ్మా ఎక్కడ ఉన్నావ్ త్వరగా రా అని పిలుస్తూ ఉంటాడు.