రుక్మిణి, ఆదిత్య ఒక చోట కలుస్తారు. ఇదేంటి పెనిమిటి ఇలా జరిగిందని రుక్మిణి బాధపడుతుంది. అనుకోకుండా జరిగిన దానికి మనం మాత్రం ఏం చేస్తాం అని ఆదిత్య అంటాడు. ఆయమ్మ నాకు ఏదో చెప్పాలని చూస్తుంది కానీ నాకు అర్థం కాలేదు అప్పటికి బిడ్డలు పెన్నుపేపర్ ఇచ్చారు కానీ రాయలేకపోతుందని రుక్మిణి చెప్తుంది. ప్రకృతి వైద్యం ఒకటి ఉంది అక్కడ ఎవరికైనా చికిత్స చేస్తే నయం అవుతుందని ఆదిత్య చెప్తాడు. వెంటనే అక్కడకి వెళ్దాం అని రుక్మిణి అంటే మాధవ్ ఒప్పుకోదు కదా అని ఆదిత్య అంటాడు. ఆయన ఎప్పుడు అంతేలే రామూర్తి గారికి చెప్తే తీసుకెళ్లమంటారు వెళ్దాం పద అని రుక్మిణి చెప్తుంది.


సత్య ఆదిత్య గురించి బాధపడుతూ ఉంటే మీకు తెలియని ఊరికి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీకు ఏకాంతం దొరుకుంతుందని దేవుడమ్మ చెప్తుంది. పాండిచ్చేరి వెళ్ళండి అక్కడ మీకు ఇష్టం కదా అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకో ఆదిత్యని నేను ఒప్పిస్తాను అని దేవుడమ్మ అంటుంది. ఆ మాటకి సత్య చాలా సంతోషిస్తుంది. జానకి బాధగా ఆలోచిస్తూ కూర్చుంటే దేవి, చిన్మయి నవ్వించడానికి ట్రై చేస్తారు. రామూర్తి జానకికి ధైర్యం చెప్పడానికి చూస్తాడు. అప్పుడే ఆదిత్య, రుక్మిణి ఇంటికి వస్తారు. మొన్న వచ్చిన డాక్టర్ చాలా మంచిది అనుకోకుండా ఆమెకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదని చెప్తాడు. ప్రకృతి వైద్యశాలకి వెళ్తే త్వరగా నయం అవుతుందని చెప్తాడు. అక్కడ కూడా వైద్యం బాగుంటుంది కాబట్టి త్వరగా కొలుకునే అవకాశం ఉందని అంటాడు. మీరు చెప్పారు అంటే బాగా ఆలోచించే చెప్తారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్దామని రామూర్తి అంటాడు.


Also Read: ఆదిత్యకి ప్రేమగా అన్నం తినిపించిన వేద - తన సూసైడ్ ఎటెంప్ట్ కి కారణం ఎవరో చెప్పి షాకిచ్చిన మాళవిక


మా అమ్మ గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని మాధవ్ అంటాడు. అలాగే అమ్మని అక్కడికే తీసుకుని వెళ్దాం కానీ మాతో పాటు మీరు కూడా రావాలి మీరు ఉంటే మా అందరికి కొంచెం ధైర్యం ఉంటుంది. ముఖ్యంగా రాధకి మా అమ్మకి అని మాధవ్ అడుగుతాడు. ఆ మాటకి రాధ షాక్ అవుతుంది. రా సారు అని దేవి, చిన్మయి కూడా పిలుస్తారు. సరే తప్పకుండా వస్తాను అని ఆదిత్య చెప్తాడు. సత్య పాండిచ్చేరి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. మన మధ్య ఎవరు రారు కాబట్టి పాత రోజులు గుర్తుకు వచ్చేలా చెయ్యాలి అప్పుడైనా ఆదిత్యలో మార్పు వస్తుందేమో అని సత్య సంబరంగా రెడీ అవుతుంది.


డాక్టర్ ని పిలిపించావ్ ఏమైంది వెనక్కి పంపించాను. ప్రకృతి వైద్యశాల అంటున్నావ్ రా అక్కడ నిన్ను బయట పదే అవకాశం లేకుండా చేస్తాను ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఈ మాధవ్ ని తక్కువ అంచనా వేస్తున్నావ్, చూస్తూ ఉండు దెబ్బ ఎలా కోడతానో నీకు అర్థం అవుతుంది. రాధ నాది నాకే దక్కుతుంది. నాదే అవ్వాలి. నేను వేసే ప్రతి అడుగు కింద మా అమ్మే నలిగిపోయింది నువ్వు ఎంత నా నుంచి రాధని ఎవ్వరూ దూరం చేయలేరని మాధవ్ కోపంగా అంటాడు. ఇంటికి వచ్చేసరికి లగేజ్ ప్యాక్ చేసి ఉండటం చూసి ఏంటి ఇది అని ఆదిత్య అడుగుతాడు. నీకోసం పాండిచ్చేరి టూర్ ప్లాన్ చేసిందని దేవుడమ్మ చెప్తుంది. నాతో చెప్పకుండా ఏంటి ఇది అని అంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు పెట్టి వెళ్ళడానికి నాకు కుదరదని చెప్పేస్తాడు. రెండు రోజులకి ఏమవుతుందని సత్య బాధగా అడుగుతుంది. ఆదిత్య మాత్రం దేవి మాటలు గుర్తు చేసుకుని నాకు క్యాంప్ ఉంది నేను ఎక్కడికి రావడం కుదరదని తేల్చి చెప్తాడు. నువ్వు ఒక్కడివే ఉద్యోగం చేస్తున్నావా ఎప్పుడు నీ పనేనా తన గురించి కూడా ఆలోచించాలి కదా అని దేవుడమ్మ సీరియస్ అవుతుంది.


Also Read: తులసికి వెన్నుపోటు పొడిచిన అనసూయ- ప్రేమ్ కి మ్యూజిక్ ఆఫర్, లాస్యని అజమాయిషీ చేసిన తులసి