'సుడిగాలి' సుధీర్ అంటే 'ఎక్స్ట్రా జబర్దస్త్' షో గుర్తుకు వస్తుంది. అందులో యాంకర్ రష్మీ గౌతమ్‌కు, అతడికి మధ్య నడిచే లవ్ ట్రాక్ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత డాన్స్ రియాలిటీ షో 'ఢీ' గుర్తుకు వస్తుంది. అందులో యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో టీమ్ లీడర్‌గా సుధీర్, 'హైపర్' ఆది చేసిన హంగామా గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ' గుర్తుకు వస్తుంది. ఇవన్నీ ఈటీవీ కోసం మల్లెమాల సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న షోస్. ఇకపై వీటిలో సుధీర్ కనిపించడు.
అవును... స్టార్ మా ఛానల్‌లో కొత్తగా ప్రారంభమైన 'సూపర్ సింగర్ జూనియర్' షోకి అనసూయతో కలిసి 'సుడిగాలి' సుధీర్ యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షో కోసం 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లను వదిలేశాడు. 'ఢీ' కొత్త సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అతడిని పక్కకు తప్పించారు. ఆ తర్వాత 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ'ల్లో కంటిన్యూ అయ్యాడు. లేటెస్ట్ ఎపిసోడ్స్ ప్రోమోలు చూస్తుంటే ఈ రెండు షోలు కూడా వదిలేశాడని అర్థం అవుతోంది.
అనిల్ రావిపూడి అతిథిగా వచ్చిన 'ఎక్స్ట్రా జబర్దస్త్' ఎపిసోడ్ చూస్తే... అందులో సుధీర్ కనిపించడు. 'గెటప్' శీను కూడా! వాళ్ళిద్దరూ లేకుండా స్కిట్ చేయడం ఎలా ఉందని 'ఆటో' రామ్ ప్రసాద్‌ను అనిల్ రావిపూడి అడిగారు. అప్పుడే చాలా మందికి సందేహాలు వచ్చాయి. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే... యాంకర్ సుధీర్ ప్లేస్‌లో రష్మీ గౌతమ్ వచ్చారు. కొత్త యాంకర్ వచ్చిందని ఆమె అనౌన్స్ చేశారు. దీన్నిబట్టి... 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' నుంచి కూడా సుధీర్ తప్పుకోన్నాడని స్పష్టం అయ్యింది.
Also Read: నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పర్మిషన్ ఇవ్వలేదట!
'నాతో పెట్టుకుంటే తెలుసు కదా!' అని రష్మీ గౌతమ్ ఏదో చెప్పబోతుంటే... మధ్యలో అడ్డుపడిన ఆది 'తెలుసు, తెలుసు... మీతో పెట్టుకుంటే కామెడీ షో నుంచి సింగింగ్ షోకి వెళ్ళాల్సి ఉంటుంది' అని పంచ్ వేశాడు. ఆ తర్వాత 'మీరిద్దరూ మాట్లాడుకుని చేశారు కదా! కొన్ని రోజులు నువ్వు చెయ్యి, తర్వాత...' అంటూ రష్మీని ఆది ఆట పట్టించాడు. ఏది ఏమైనా... సుధీర్ - రష్మీ కాంబినేషన్‌ను టీవీ ఆడియన్స్ మిస్ అవుతారు.
Also Read: 'జాతి రత్నాలు' డైరెక్టర్ తో శివ కార్తికేయన్ సినిమా - రిలీజ్ డేట్ ఫిక్స్