తమిళ హీరో శివ కార్తికేయన్ స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలు 'సీమ రాజా', 'రెమో', 'శక్తి', 'డాక్టర్'తో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఇప్పుడు 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశారు. శివకార్తికేయన్ 20వ సినిమా (SK20) ఇది. టాలీవుడ్‌లో టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 


తమన్ సంగీతం అందించనున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. న్యూ ఇయర్ సందర్భంగా సినిమాను ప్రకటించి.. ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేయనున్నారు. 


ఇటీవల శివకార్తికేయన్ నటించిన 'డాన్' సినిమా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ అయింది. ఈ సందర్భంగా శివకార్తికేయన్ కి కంగ్రాట్స్ చెబుతూ.. నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. వినాయక చవితి సందర్భంగా 'SK20' రిలీజ్ కానుంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు. 


Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?


Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?