మొదటి ఆహ్వాన పత్రి అందుకున్న మీరు షాప్‌ ఓపెనింగ్‌ రావాలంటూ తను తీసుకొచ్చిన స్వీట్స్, కార్డును జ్ఞానాంభ చేతిలో బలవంతంగా పెట్టేస్తుంది సునంద. స్వీట్స్‌ వ్యాపారంలో తలపండిన రామచంద్ర సలహాలు తీసుకుంటానంటూ చెప్తాడు కన్నబాబు. తప్పకుండా రావాలంటూ చెప్పి మరీ వెళ్తారు. 


వాళ్లు అలా వెళ్లిన వెంటనే అసలు స్వీట్‌ షాప్ ఎందుకు పెట్టాలనుకుంటాన్నారో అర్థం కాక తలబద్దలు కొట్టుకుంటారు జ్ఞానాంభ, గోవిందరాజు. వాళ్ల ఇష్టం వాళ్లదని... వాళ్ల గురించి మనం ఆలోచించడం ఏంటని చివరికి అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ జానకీ రామచంద్ర ప్రవర్తనపై మల్లిక అనుమాన పడుతుంది. 


ఇచ్చిన షాక్‌కు జానకీ రామచంద్రకు దిమ్మదిరిగి బొమ్మకనిపిస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు సునంద, కన్నబాబు. ఇంతలో అక్కడకు వచ్చిన జానకి... ఏంటీ పిచ్చి పిచ్చిగా ఉందా గడవులోపు డబ్బులు ఇస్తామంటే ఈ ఎక్స్‌ట్రాలు ఏంటని ప్రశ్నిస్తుంది. ఎక్‌ట్రాలు  కాదని.. నమ్మకమని అంటాడు కన్నబాబు. డబ్బులు కట్టడం మీ వల్ల కాదని నా నమ్మకమని అంటాడు. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకుంటానంటాడు. గడువు లోపు నీ డబ్బులు నీకు ఇస్తామని ఈ లోగా పిచ్చిపిచ్చిపనులు చేస్తే బోగాదని హెచ్చరిస్తాడు రామచంద్ర. మీ అమ్మకు చెప్పేస్తానని భయపడ్డావా... అని వెటకారం చేస్తాడు కన్నబాబు. ఈ భయం నీ పెళ్లాం నన్ను కొట్టక ముందు, నీవు నా తోటకు వచ్చి కొట్టకు ముందు ఉండాలంటాడు. వీళ్ల మధ్య జరుగుతున్న డిస్కషన్‌ను మల్లిక చాటుగా వింటుంది. 
మర్యాదగా వెళ్లిపోమంటుంది జానకి.. గడువు వరకు నోరుమూసుకొని ఉండమని హెచ్చరిస్తుంది జానకీ. మళ్లీ మళ్లీ ఇంటికి వస్తే బెదిరించడం నీకే కాదు మాకు వచ్చిని వార్నింగ్ ఇస్తుంది. ఆ బెదిరింపులకు నీవు తట్టుకోలేవని అంటుంది. 
జానకీ రామచంద్ర భయపడటానికి కారణం ఏమై ఉంటుందని మల్లిక తెగ ఆలోచిస్తుంది. కన్నబాబు, జానకీరామచంద్ర మధ్య ఏదో కథ ఉందని అనుకుంటుంది. ఇంతలో పని మనిషి చికితా వచ్చి ఎందుకలా ఆలోచిస్తున్నారని ఆరా తీస్తుంది. అసలు విషయం చెబుతుంది మల్లిక. అది విన్న చికితా... ఎందుకంతా ఆలోచించి చచ్చిపోతున్నారని కోపంతో వెళ్లిపోతుంది. ఎవరు ఏం చెప్పినా ఆ గొలుసుకొట్టు వెనుక ఉన్న కుట్ర తెలుసుకుంటానంటూ వెళ్లిపోతుంది మల్లిక. 


స్వీట్ షాపు రాయించుకున్న సంగతి అమ్మకు  ఆ కన్నబాబు ఎక్కడ చెప్పేస్తాడో అని భయపడ్డానంటూ డిస్కష్ చేసుకుంటారు జానకీరామ. గడువు తీరేలోపు ఆ డబ్బులు సంగతి కన్నబాబు ఎవరికీ చెప్పలేడని అంటుంది జానకి. ఇంతలో అక్కడే గోవిందరాజు ఉంటాడు. ఏంటమ్మ ఏదో డబ్బులు అంటున్నారేంటీ అంటాడు గోవిందరాజు. మీకు డబ్బులు గురించి టెన్షన్ ఏంటని ప్రశ్నిస్తాడు. హైదరాబాద్ వెళ్లడానికి డబ్బులు అంటూ కవర్ చేస్తాడు రామచంద్ర. ఇంతలో వీళ్ల డిస్కషన్ వింటుంది మల్లిక. సడెన్‌గా హైదరాబాద్ ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటుంది. రామచంద్రకు తండ్రి స్వీట్ బాక్స్ ఇస్తాడు. అందులో డబ్బులు ఉంటాయి. దాన్ని చూసిన మల్లిక షాక్ తింటుంది. ఇన్ని డబ్బులు ఎందుకని అడుగుతాడు రామచంద్ర. హైదరాబాద్‌ వెళ్తున్నారి ఖర్చులకు అవుతాయంటాడు. మీ దగ్గర డబ్బుల్లేవని ఇవ్వడం లేదన్న గోవిందరాజు... చిన్నప్పటి నుంచి రామచంద్ర పడి కష్టాన్ని గుర్తు చేసుకుంటాడు. నీ కోసం ఈ నాన్న  జత బట్టలు కూడా కొనివ్వలేకపోయాడని అనుకుంటాడు గోవిందరాజు. ఇప్పుడు నేను ఇచ్చన డబ్బులు కూడా నీవు ఇచ్చినవే అంటాడు. నా కోసం కాదనకుండా తీసుకోవాల్సిందేనంటాడు. హైదరాబాద్ వెళ్లడానికి తీసుకొచ్చిన బస్‌ టీకెట్‌ కూడా వాళ్ల చేతికి ఇస్తాడు. రాముడూ వంటల పోటీల్లో గెలవాలని... నీ గెలుపు చూసి నేను గర్వంతో పొంగిపోవాలంటాడు. ఆ క్షణం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నానంటాడు. 


పక్కనే ఉండి వింటున్న మల్లిక... అంటే వీళ్లు వెళ్తుంది వైజాగ్‌ పెళ్లికి కాదని... హైదరాబాద్‌కు అని తెలుసుకుంటుంది. వెంటనే విషయాన్ని జ్ఞానాంభకు చేరవేయాలని పరుగెడుతుంది. 


పెళ్లికి వెళ్తున్నారని జానకీరామచంద్రకు పులిహోర కలుపుతుంది జ్ఞానాంభ. ఇంతలో అక్కడకు వచ్చిన మల్లిక.  బాధేస్తుందని... గుండె తరక్కుపోతుందని అంటుంది. ఎందుకు అని అడుగుతుంది జ్ఞానాంభ. వాళ్లు హైదరాబాద్‌లో బిర్యాని తినే ప్లాన్‌లో ఉన్నారని... చెబుతుంది మల్లిక. వాళ్లు వైజాగ్‌ పెళ్లికి వెళ్తుంటే... హైదరాబాద్‌ అంటావేంటని ఎదురు ప్రశ్నిస్తుంది జ్ఞానంభ. వాళ్లిద్దరు వెళ్లేది పెళ్లికి కాదని...హైదరాబాద్ వంటల పోటీకని ఊదేస్తుంది మల్లిక. ఈ ప్లాన్ అంతా మామయ్యే నడిపిస్తున్నారని చెబుతుంది. జ్ఞానాంభ మాత్రం నమ్మదు. వెళ్లి బస్‌ టికెట్లు చూపించమని అడగమంటుంది మల్లిక. 



రేపటి ఎపిసోడ్
ఊరు వెళ్తున్న జానకీరామచంద్రను బస్‌ టికెట్స్ చూపించమని అడుగుతుంది జ్ఞానాంభ. వెన్నెలా ఆ టికెట్‌ చూసి ఆ వివరాలు చెప్పమని అడుగుతుంది. టికెట్ చూసి ఆమె ఏం చదువుతుందో అని ఆ ముగ్గురిలో ఒకటే టెన్షన్