పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకుడి సిద్ధూ మూస్ వాలా మరణంతో ఉత్తరాది ఉలిక్కిపడింది. ఎనిమిది మంది దుండగులు ఏకే-94 రైఫిళ్లతో అతడి కారును చుట్టుముట్టి.. దారుణంగా కాల్చి హత్య చేశారు. అతడి శరీరంలోకి సుమారు 20 తూటలకు దూసుకెళ్లినట్లు సమాచారం. చిత్రం ఏమిటంటే.. సిద్ధూ రెండు వారాల కిందట విడుదల చేసిన పాట కూడా ఇదే తరహాలో ఉంటుంది. అందులోని కొన్ని లిరిక్స్.. ప్రస్తుత ఘటనకు దగ్గరగా ఉన్నట్లు సిద్ధూ అభిమానులు అంటున్నారు.
మే 15న ‘ది లాస్ట్ రైడ్’ అనే పాటను సిద్ధూ తన అధికారిక యూట్యూబ్ చానెల్‌లో విడుదల చేశాడు. ఈ పాటను 10 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. వాస్తవానికి సిద్ధూ ‘ది లాస్ట్ రైడ్’ పాటను విడుదల చేసింది తనను ఉద్దేశించి కాదు. 1996లో 25 ఏళ్ల వయస్సులో చనిపోయిన రాజపర్ టుపాక్ షకుర్ మరణాన్ని ఉద్దేశిస్తూ ఈ పాటను రూపొందించాడు. రాపర్ షకూర్‌ను కూడా దుండగులు కారులోనే కాల్చి చంపేశారు. దీంతో సిద్ధూ పాటలో కూడా ఆ ప్రస్తావన వస్తుంది. అతడి తరహాలోనే ఇప్పుడు సిద్ధూ కూడా మరణించడం గమనార్హం. దీంతో అంతా సిద్ధూ తన మరణాన్ని ముందే ఊహించాడా? లేదా ఆ పాటను చూసి దుండగులు సిద్ధూ హత్యకు ప్లాన్ చేశారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఎవరీ సింగర్ సిద్ధూ మూస్ వాలా? అతడిని ఎవరు? ఎందుకు హత్య చేశారు?
టుపాక్ షకూర్‌ను హత్య చేసింది ఈ కారులోనే: