Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: హిమను బయటకు తీసుకొచ్చిన ప్రేమ్ అసలు విషయం తెలుసుకునే పనిలో ఉంటాడు. హిమను డైరెక్ట్‌గానే నిశ్చితార్థం ఎందుకు వద్దన్నావని అడుగుతాడు. దాని గురించి ఏమీ అడగొద్దని చెప్పేస్తుంది హిమ. అసలు నీ మనసులో ఏముంది ఎందుకు వద్దన్నావని ప్రశ్నిస్తాడు ప్రేమ్. ఇకపై ఈ విషయంపై నన్నేమీ అడగొద్దని దండం పెట్టి చెప్పేస్తుంది హిమ. అయినా లాగుతూనే ఉంటాడు ప్రేమ్. ఎవరు అడిగినా తన సమాధానం ఇదే అని చెప్పి వెళ్లిపోతుంది. ఇలా వెళ్లిపోతే హిమ మనసులో ఏముందో ఎలా తెలుస్తుందని అనుకుంటాడు ప్రేమ్.
శోభ తన పని మనిషి శాంతాభాయ్‌ని పిలిచి డబ్బులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్పి.. వేరే ఇంటికి మారిపోమంటుంది. జ్వాల ఉన్న ఏరియాలోనే రూమ్ ఇంటిని అద్దెకు తీసుకొని ఉండమంటుంది. ఏం చేయాలో తాను చెబుతానని శాంతాభాయ్‌ని పంపించేస్తుంది. జ్వాల, నిరుపమ్ మధ్య అడ్డుగోడ కట్టేందుకు ప్లాన్ చేస్తుంది శోభ.
ఇక్కడ రెస్టారెంట్‌కు వచ్చిన జ్వాల, నిరుపమ్ హిమ కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్లిద్దర్ని చూసి చాలా ఆనంద పడుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇద్దర్ని ఒకటి చేయాలని ప్లాన్ చేస్తుంది. జ్వాలతో క్లోజ్‌గా ఉంటే హిమలో అసూయ మొదలవుతుందని నిరుపమ్ అనుకుంటాడు.
మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావని అడుగుతుంది హిమ. అసూయ ప్రారంభమైందని అనుకుంటాడు నిరుపమ్. మరింత క్లోజ్‌గా ఉంటాడు. ఇంతలో ఐస్‌క్రీమ్ నిరుపమ్ ఆర్డర్ ఇస్తాడు. ఏం కావాలో చెప్పమని హిమను అడుగుతాడు. ఐస్‌క్రీం చల్లగా ఉంటుంది... వెజ్‌సూప్ చెబుతుంది. ఇది విన్న నిరుపమ్... హిమలో అసూయ పీక్స్‌కు వెళ్లిందనుకుంటాడు.
హిమ ఎందుకు నిశ్చితార్థం ఎందుకు వద్దనుకుందో ఆలోచిస్తుంటాడు ప్రేమ్. ఈ విషయం తెలిస్తే కానీ... తన మనసులో మాట చెప్పలేననుకుంటాడు. తనే జీవితం అనకుంటాడు. తనే సర్వశ్వం అని చెప్పేస్తాడు.
ఇక్కడ రెస్టారెంట్‌లో జ్వాలను పొగిడేస్తుంటాడు నిరుపమ్. అతని ప్లాన్ ఏంటో గ్రహించిన హిమ.. దానికి రివర్స్‌లో రియాక్ట్ అవుతుంది. మనసులో ఏది ఉన్నా బయటకు చెప్పగలిగే గుణం జ్వాలకు ఉంటే... ఏదీ చెప్పుకోలేని వాళ్లు కూడా ఉంటారని హిమను టార్గెట్ చేసుకొని సెటైర్లు వేస్తుంటాడు. పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు నిరుపమ్.
నిరుపమ్‌పై ఉన్న ప్రేమ గురించి హిమ, జ్వాల మాట్లాడుకుంటారు. ప్రేమ సంగతి జ్వాల చెప్తేస్తానంటే హిమ ఆగమంటుంది. ఇంతలో బిల్ కట్టడానికి తిరిగి వస్తాడు నిరుపమ్. వాళ్లిద్దరు మాటలు విన్నాడేమో అనుకొని హిమ, జ్వాల కంగారు పడతారు. కానీ అతను అవేమీ వినలేదని తెలుసుకొని టెన్షన్ తగ్గుతుంది. బిల్ పే చేసి నిరుపమ్ వెళ్లిపోతాడు. మళ్లీ నిరుపమ్‌పై ఉన్న ప్రేమ గురించి జ్వాల మాట్లాడుతుంది. ఇలా మనసులో దాచుకొని ఉంచడం తన వల్ల కాదని.. ఇప్పుడే చెప్పేస్తానంటూ వెళ్లిపోతున్న నిరుపమ్‌ను పిలుస్తుంది. హిమ మాత్రం వద్దని వారిస్తుంది. ప్రేమ గురించి చెప్పే రోజు గొప్ప రోజై ఉండాలని ఏదో చెప్పి జ్వాలను ఒప్పిస్తుంది.
ఇంట్లో సౌందర్య, ఆనంద్‌రావు ఫ్యామిలీ సంగతులు మాట్లాడుకుంటారు. హిమ కారణంగా ఆనందాలు దూరమయ్యాయని బాధపడుతుంటారు. అక్కడ నిరుపమ్ ఓదార్చలేకపోతున్నామని.. హిమ నుంచి అసలు విషయం తెలుసుకోలేమని అంటుంది. ఇంతలో హిమ వస్తుంది. పెళ్లి సంగతి ప్రస్తావిస్తుంది సౌందర్య. సౌర్య వస్తేనే పెళ్లి చేసుకుంటాను అనే అవకాశం ఇక లేదని హిమకు సౌందర్య చెప్పేస్తుంది. ఇప్పుటికే చాలా అబాసుపాలయ్యామని.. ఇకపై పెళ్లి చేసుకొని అందరికీ సమాధానం చెప్పాలనుకుంటున్నట్టు చెబుతుంది.
రేపటి భాగం
భోజనం తీసుకొచ్చిన జ్వాలపై గట్టి గట్టిగా అరుస్తాడు ప్రేమ్. భోజనం తెచ్చానా... డబ్బులు తీసుకున్నానా అన్నట్టు ఉండాలి కానీ ఎక్‌ట్రాలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాక... సత్యం, నిరుపమ్ ఆశ్చర్యపోతారు. జ్వాల ఏడుస్తూ ఉండిపోతుంది.