Nayanthara: నయన్-విఘ్నేష్ పెళ్లికి టీటీడీ పర్మిషన్ ఇవ్వలేదట!

నయన్-విఘ్నేష్ తమ పెళ్లిని తిరుపతిలో చేసుకోవాలనుకున్నారు. రీసెంట్ గా ఈ జంట తిరుమలలోని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Continues below advertisement

తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, అగ్ర కథానాయిక నయనతార చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు  ఈ జంట పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీరి వెడ్డింగ్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. జూన్ 9న పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఇందులో పెళ్లి వెన్యూ మహబ్స్ అని ఉంది. ఇదొక స్టార్ హోటల్. 

Continues below advertisement

నిజానికి నయన్-విఘ్నేష్ తమ పెళ్లిని తిరుపతిలో చేసుకోవాలనుకున్నారు. రీసెంట్ గా ఈ జంట తిరుమలలోని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు వివాహ మండపాలను కూడా పరిశీలించారు. కానీ టీటీడీ అధికారులు వారి పెళ్లి తిరుపతిలో జరిపించడానికి పర్మిషన్ ఇవ్వలేదట. నయన్-విఘ్నేష్ కుటుంబాల నుంచి మొత్తం 150 మంది హాజరవుతారని చెప్పారట. 

అంతమందికి పర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో.. ఇక చేసేదేంలేక ఈ జంట పెళ్లి వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఓ స్టార్ హోటల్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది. ఆ తరువాత చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఇండస్ట్రీ వారిని ఆహ్వానించనున్నారు. 

Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?

Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Continues below advertisement
Sponsored Links by Taboola