Gachibowli Case :గచ్చిబౌలి యువతిపై అత్యాచారంలో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు గాయత్రి తల్లి, సోదరి గాయత్రి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. గాయత్రి, శ్రీకాంత్ ఇద్దరు పెద్ద క్రిమినల్స్ అని, ఆస్తి కోసం శ్రీకాంత్ తన చెల్లిని అడ్డుపెట్టుకొని డ్రామా అడుతున్నాడని ఆరోపిస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి తాము అదే ఇంట్లో ఉండేవాళ్లమని,  శ్రీకాంత్, గాయత్రి కలిసి తమను ఇంట్లో నుంచచి గెంటేశారని ఆరోపించారు. శ్రీకాంత్, గాయత్రిలపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు తమ బాధను పట్టిచుకోవట్లేదన్నారు. శ్రీకాంత్ ఇప్పుడు తమ ఇంట్లోనే ఉన్నాడన్నారు. గచ్చిబౌలి సి.ఐ సురేష్.. శ్రీకాంత్ ను ఇంట్లోనే ఉండమని చెప్పారని ఆరోపించారు. ఇంట్లో ఉండి శ్రీకాంత్ బయటికి రావట్లేదన్నారు. సి.ఐ సురేష్ శ్రీకాంత్ కి సపోర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. శ్రీకాంత్ కి ఏమి సంబంధమని సీఐ సురేష్ ఎందుకు ప్రశ్నించట్లేదన్నారు. ఇంటి నుంచి మమ్మల్ని బయటికి పంపి, గాయత్రిని జైలుకు పంపి శ్రీకాంత్ తమ ఆస్తి కొట్టేయాలి అని ప్లాన్ వేశారని గాయత్రి తల్లి, సోదరి ఆరోపిస్తున్నారు. 



(గాయత్రి తల్లి, సోదరి)


ఏబీపీ ప్రతినిధిపైకి కుక్కలు వదిలిన శ్రీకాంత్ 


గచ్చిబౌలిలోని నిందితురాలు గాయత్రి ఇంటిలోపలే ప్రధాన నిందితుడు శ్రీకాంత్ ఉన్నాడని తెలుస్తోంది. అతడ్ని బయటకు రప్పించే ప్రయత్నం చేశారు ఏబీపీ దేశం ప్రతినిధి. అయితే ఏబీపీ ప్రతినిధిపైకి శ్రీకాంత్ పెంపుడు కుక్కలను వదిలారు. ఇంటి బయట గాయత్రి తల్లి, సోదరి ఆందోళన చేస్తున్నారు. 


వెలుగులోకి విస్తుపోయే నిజాలు


హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం చేయించిన శ్రీకాంత్, గాయత్రి కేసు కీలక ములుపులు తిరుగుతుంది. పోలీసుల పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తాయో తెలుస్తోంది. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న యువతిని బంధించి అత్యాచారం చేయించిన కేసులో అరెస్టైన గాయత్రి 2009లోనే ఇంట్లోంచి పారిపోయి తన క్లాస్ మేట్ ను వివాహం చేసుకుంది. 2014లో భర్తపై గృహహింస కేసు పెట్టి అతని నుంచి దూరంగా ఉంటుంది. అయితే తాజాగా శ్రీకాంత్, గాయత్రి నాటకం ఆడి యువతితో స్నేహం నటించి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు శ్రీహర్షిత ఆస్తి కాజేందుకు శ్రీకాంత్, గాయత్రి ఈ అత్యాచారం వ్యవహారం నడిపించినట్లు సమాచారం.


శ్రీకాకుళంలో మొదలైన పరిచయం 


ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన శ్రీకాంత్, అతని తల్లిదండ్రులు చిన్న పూరి గుడిసెలో ఉండేవారు. రోడ్డుపై సెకండ్ హ్యాండ్ దుస్తులు విక్రయించుకుని జీవనం సాగిస్తున్నారు. బాధితురాలు శ్రీహర్షితతో శ్రీకాంత్ కు శ్రీకాకుళంలోనే పరిచయం పెంచుకున్నాడు. తాను కూడా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు మాయమాటలు చెప్పి, ఆమెను నమ్మించాడు.  శ్రీ హర్షితతో తన పరిచయాన్ని గాయత్రికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శ్రీకాంత్.  2020 జూన్ లో గాయత్రి తల్లి, సోదరిని ఇంట్లో నుంచి బయటకు గెంటించాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ అక్క అడగటానికి వస్తే గాయత్రితో ఆమెను కూడా కొట్టి బయటకు పంపించాడు. అయితే శ్రీహర్షితను 2021 లో శ్రీకాంత్ హైదరాబాద్ తీసుకువచ్చాడు. 2021 అక్టోబర్ లో గాయత్రి ద్వారా శ్రీహర్షితను తమ ఇంట్లోనే ఉండాలని ఒప్పించాడు. దీంతో శ్రీహర్షిత గత ఏడాది అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు వారితోనే కలిసి ఉంది. శ్రీకాంత్, శ్రీహర్షితల మధ్య సంబంధంపై అనుమానం పెంచుకున్న గాయత్రి 2022 ఏప్రిల్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో శ్రీకాంత్, శ్రీహర్షితపై  వివాహేతర సంబంధం కేసు నమోదు పెట్టింది. తాజాగా కేసు విత్ డ్రా చేసుకునేందుకు మాట్లాడాలని మే 26న శ్రీహర్షిత కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించింది గాయత్రి. అదే రోజు శ్రీహర్షిత తల్లిదండ్రులను బయట ఉండమని చెప్పిన గాయత్రి శ్రీహర్షితను బంధించి నలుగురితో అత్యాచారం చేయించింది.


వీడియోలు తీసి బెదిరింపులు


శ్రీహర్షితను చిత్రహింసలకు గురిచేసి, వీడియోలు తీసింది గాయత్రి. ఎవరికైనా చెబితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించింది. బాధితురాలు శ్రీహర్షిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే గాయత్రితో సహా మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో శ్రీకాంత్ ను కూడా అరెస్ట్ చేసి శిక్షించాలని బాధితురాలి తల్లి కోరుతోంది.