Just In
Nuvvunte Naa Jathaga Serial Today February 6th: 'నువ్వుంటే నా జతగా' సీరియల్: సూర్యకాంతాన్ని బుట్టలో వేసుకున్న త్రిపుర.. మిధున, దేవాల కామెడీ కొట్లాట!
Nuvvunte Naa Jathaga Today Episode మిధునని తన పుట్టింటికి తీసుకెళ్లడానికి త్రిపుర సూర్యకాంతాన్ని నగలతో బుట్టలో వేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున నానమ్మ రావడంతో చాలా సంతోషిస్తుంది. ఎవరూ నన్ను నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మి నాకోసం వచ్చినందుకు థ్యాంక్స్ నానమ్మ అంటుంది. దానికి పెద్దావిడ మిధునతో నువ్వు నమ్ముకున్న మన ఆచారాలు, నమ్మకాలే నీ జీవితాన్ని నిలబెడతాయని ఆ పార్వతి పరమేశ్వరుల అండ నీకు ఎప్పుడూ ఉంటుందని ధైర్యం ఇస్తుంది.
దేవా రెడీ అయి బయటకు వెళ్లాలని అంటాడు. దేవాకి మిధున ఎదురుగా వస్తుంది. దేవా తల్లికి టిఫెన్ పెట్టమని అంటే మిధున నేను టిఫెన్ పెడతాను అని అంటుంది. నాకు టిఫెన్ పెట్టడానికి నువ్వు ఎవరు అని దేవా అడిగితే మిధున తాళి బొట్టు చూపిస్తుంది. దాంతో దేవా నెత్తి బాదుకుంటాడు. ఖాళీ కడుపుతో అయినా ఉంటాను కానీ నువ్వు పెట్టే టిఫెన్ తినను అంటాడు. ఒక్క రోజు ఉపవాసం ఉండు తెలుస్తుందని అంటుంది మిధున. ఇక దేవా తల్లిని పిలిచి కొంత మంది విసిగిస్తున్నారని చెప్తాడు. దాంతో శాంతమ్మ ఎందుకమ్మా విసిగిస్తావ్ అని ప్లేట్ తీసుకొని దేవాకి ఇస్తుంది. ఆ ముఖం చూస్తూ తినలేను పక్కకు వెళ్లమని దేవా అంటే మిధున కోపంతో పక్కకు వెళ్లిపోతుంది.
మరోవైపు సూర్యకాంతం మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొస్తూ కార్లలో తిరగాలి అనుకున్నా ఇలా రోడ్ల మీద నడుచుకుంటూ రావాల్సి వస్తుందని తెగ ఫీలైపోతూ ఉంటుంది. ఇంతలో దారిలో ఓ బంగారు నెక్లెస్ చూస్తుంది. అదృష్టం కలిసొచ్చిందని అందుకోడానికి కిందకి వంగగానే మిధున వదిన త్రిపుర నక్లెస్ అందుకొని 22 క్యారెట్ల నెక్లెస్ రెండు లక్షలు అని అంటుంది. రెండు లక్షలా అని సూర్యకాంతం నోరెళ్ల బెడుతుంది. త్రిపుర ఆ నెక్లెస్ సూర్యకాంతానికి ఇచ్చి నేను చెప్పినట్లు చేస్తే ఇలాంటివి నువ్వు ఎన్ని అడిగితే అన్ని ఇస్తానని అంటుంది. దాంతో సూర్యకాంతం అయితే చెప్పండి ఏం చెప్తే అది చేస్తానని అంటుంది. ఇప్పటికి నెక్లెస్ తీసుకొని వెళ్లిపో అవసరం ఉన్నప్పుడు చెప్తానని త్రిపుర చెప్పి సూర్యకాంతాన్ని పంపేస్తుంది.
మరోవైపు దేవా ఫ్రెండ్స్ దేవా ఫోన్ నుంచి వచ్చిన దేవా మిధునల ఫొటో చూసి గుండె పట్టుకుంటారు. ఇది నిజమా అబద్ధమా అని షాక్ అయిపోతారు. మిధునని వదిన అంటేనే చితక్కొట్టాడు ఇప్పుడు ఏకంగా ఊరంతా తెలిసేలా ఫ్లక్సీ వేయడానికి పిక్ పంపాడని నోరెళ్లబెడతారు. ఒక సారి ఫోన్ చేసి క్లారిటీ తెచ్చుకుందామని దేవాకి కాల్ చేస్తారు. దేవా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే మిధున కావాలనే గిన్నెలు తెచ్చి పెద్ద పెద్ద సౌండ్ చేస్తుంది. దాంతో దేవా మిధున చేసే సౌండ్‌కి ఓకే అనేస్తాడు. తర్వాత వెళ్లి మిధునను తిడతాడు. శాంతమ్మ వచ్చి ఏంటమ్మా ఏం కావాలి ఏంటి ఈ గొడవ అని అంటుంది. బాక్స్ కోసం అని త్రిపుర అనగానే నన్ను అడిగితే నేను ఇస్తాను అని అంటుంది. తర్వాత శాంతమ్మ కళ్లు తిరిగి పడిపోబోతే దేవా పట్టుకుంటాడు. దేవా తల్లిని కూర్చొపెట్టి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అంటే అయిపోయావి అని అంటుంది. దాంతో దేవా నేను ట్యాబ్లెట్స్ తీసుకొస్తానని అంటాడు.
సూర్యకాంతం అక్క ప్రమోదినితో దేవా ఫోన్ మాట్లాడినప్పుడే మిధున సౌండ్ చేసింది అంటే ఏదో మతలబు ఉందని చెప్తుంది. దేవా బయటకు వెళ్తుంటే మిధున వచ్చి నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా అంటే దేవా మీ పుట్టింటికా అని తెగ సంబర పడిపోయి పద పద బండి ఎక్కు అంటాడు. మిధున బైక్ ఎక్కి గుడి దగ్గర డ్రాప్ చేయ్ తర్వాత మనిద్దరం అల్లుడు కూతురి హోదాలో వెళ్దామని అంటుంది. దాంతో దేవా మిధునని దింపేస్తాడు. మిధున కోపంతో నన్ను తీసుకెళ్లకపోతే ఆ బండి ఆగిపోతుంది అంటుంది. బయటకు వెళ్లగానే దేవా బైక్ ఆగిపోతుంది. దేవా షాక్ అయి మిధునను చూస్తాడు. మిధున దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్దామని అంటుంది. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తారు. మధ్యలో ఒకామె దేవాతో నీ భార్య కుందనపు బొమ్మలా ఉందని సంతోషంగా ఉన్నావ్ అంటే దేవా ఆమెతో గొడవ పడతాడు. మిధున చూసి నవ్వుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పుష్ప రేంజ్‌లో జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. తల్లి నగలు చెక్ చేసిన జ్యోత్స్న!