Ustaad Bhagat Singh Movie Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ పునఃప్రారంభం కానున్నట్లు ఇటీవలే సోషల్ మీడియా వేదికగా టీం వెల్లడించింది. చెప్పినట్లుగానే దీనిపై అప్‌డేట్ వచ్చింది.
షూటింగ్ సెట్‌లోకి శ్రీలీల
ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా.. ఆమె త్వరలోనే ఇందులో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. జూన్ 10 నుంచి దాదాపు నెల రోజుల పాటు కొత్త షెడ్యూల్ జరగనుందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..
ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. పవన్, హరీష్ శంకర్ కాంబో అంటేనే బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' సినిమా మాకు గుర్తొస్తుంది. మరోసారి అదే కాంబోలో పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ కనిపించనుండడంతో భారీ హైప్ నెలకొంది. ఆయన రోల్ చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని మూవీ టీం తెలిపింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ సినిమాల తరహాలోనే మరోసారి బాక్సాఫీస్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ రెమ్యూనరేషన్‌పై..
ఈ మూవీలో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో ఇటీవల చర్చ సాగింది. సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ జర్నలిస్ట్ ఇటీవల చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ పవర్ స్టార్‌కు రూ.170 కోట్లు ఆఫర్ చేశారనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోలు సైతం కళ్లు చెదిరేలా ఈ అమౌంట్ ఉండడంతో నెట్టింట పెద్ద చర్చే సాగింది. 'గబ్బర్ సింగ్' కళ్లు చెదిరే కలెక్షన్లు చూసే.. పవన్‌కు ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారంటూ ప్రచారం సాగుతోంది.
జూన్ 12న హరిహర వీరమల్లు
మరోవైపు.. పవన్ కల్యాణ్ లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరిహర వీరమల్లు' జూన్ 12 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. తాజాగా డబ్బింగ్ పనులు సైతం పవన్ పూర్తి చేశారు. ఏకాధాటిగా 4 గంటల్లో డబ్బింగ్ పూర్తి చేసినట్లు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనుండగా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. మూవీలో పోరాట యోధుడిగా పవన్ కనిపించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు.. సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' సైతం తెరకెక్కుతోంది.