Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర డాక్టర్‌కి డబ్బు ఇచ్చిందని తెలిసి పద్మాక్షి డాక్టర్‌కి తానే డబ్బు ఇచ్చానని అందరి ముందు సహస్రని కాపాడుతుంది. తర్వాత పద్మాక్షి సహస్రని చాటుగా తీసుకెళ్లి డాక్టర్‌కి అన్ని లక్షలు ఎందుకు ఇచ్చావ్ అని ప్రశ్నిస్తుంది. సహస్ర తల్లికి మొత్తం చెప్తుంది. యాక్సిడెంట్ దెబ్బలు మాత్రమే నిజం అని మిగతాదంతా పెళ్లి కోసం నేను డాక్టర్‌ ఆ డ్రామా ఆడామని చెప్తుంది. పద్మాక్షి షాక్ అవుతుంది. అంత నటిస్తే గానీ నాకు బావకి పెళ్లి కాలేదు అంటుంది.

పద్మాక్షి కూతురితో నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా.. నువ్వు విహారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావ్ అని అంటుంది. అది మోసం అనుకో ఇంకేమైనా అనుకో కానీ నాకు బావతో పెళ్లి జరగాలి అనుకున్నా చేసుకున్నా అని అంటుంది. నువ్వు చేసిన మోసం ఇంట్లో ఎవరికీ తెలిసినా ఏం జరుగుతుందో తెలుసా అని అంటుంది. డాక్టర్ నిజం చెప్తే ఏం అవుతుందో తెలుసా అంటే డాక్టర్ అస్సలు చెప్పదు అని అంటుంది. మోసం చేసి పెళ్లి చేసుకుంటే ఎవరూ క్షమించరు అని పద్మాక్షి అంటుంది. నువ్వేం టెన్షన్ పడకు అమ్మ నేను చూసుకుంటా అని సహస్ర అంటుంది. 

ఆఫీస్‌లో విహారి అందరితో వీ క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌ ఇప్పటి వరకు లక్ష్మీ చూసుకుంది ఇప్పుడు సహస్ర కూడా చూసుకోవాలి అనుకుంటుంది అందుకే ఇద్దరికీ ఓ చిన్న హెల్దీ టెస్ట్ పెడదాం అని అంటాడు. ఇద్దరికీ తమ ప్రాజెక్ట్‌ గురించి కొంచెం  చెప్పమని అంటారు. లక్ష్మీ ఈ ప్రాజెక్ట్‌కి వరల్డ్‌ వైడ్ నెట్ వర్క్, లోకల్ నెట్‌ వర్క్ గురించి చెప్తుంది. అందరికీ అందుబాటులో చిన్ని చిన్ని స్టోర్ట్స్ ఏర్పాటు చేయాలి అన్నదే నా ఆలోచన అని చెప్తుంది. లక్ష్మీ ఐడియా సూపర్ అని విహారి అంటాడు. తర్వాత సహస్రని చెప్పమని అంటాడు. 

సహస్ర తన ఐడియా వీ క్రాఫ్ట్‌లో కేవలం కళాకారులనే కాకుండా ఫ్యాషన్ డిజైన్ చేసిన యంగ్ ట్యాలెంట్‌ని కూడా హైయర్ చేసుకుంటున్నాం అని చెప్తుంది. దాని వల్ల అందరికీ సరిపోయే ప్రొడక్ట్స్ మనమే చేయొచ్చని చెప్తుంది. వీ క్రాఫ్ట్‌తో కొలాబ్రేట్ అవడానికి టాప్ మోస్ట్  కార్మికులు రెడీగా ఉన్నారు అని అందులో టాప్ మోస్ట్ రెడీగా ఉన్నారని చేనేత వస్త్రాల తయారీలో నేషనల్ అవార్డు గ్రహీత ఆదికేశవ్ గారు కూడా మనతో కొలాబ్రేట్ అవుతారని ఆయన లాంటి పెద్ద వాళ్లతో మాట్లాడానని అందరూ ఒకే అన్నారని సహస్ర చెప్తుంది. తండ్రిని చూసిన కనకం షాక్ అయిపోతుంది. విహారి లక్ష్మీని చాటుగా తీసుకెళ్లి సహస్రకి మీ నాన్న గురించి ఎలా తెలుసు అని అడుగుతాడు. పెళ్లి షాపింగ్ కోసం మా ఇంటికి వచ్చారు కదా అందరికీ తెలిసిందని లక్ష్మీ అంటుంది. 

లక్ష్మీ నుదిటిన బొట్టు లేకపోవడం చూసిన విహారి దేవుడి దగ్గర బొట్టు తీసి లక్ష్మీకి పెడతాడు. లక్ష్మీ కంట్లో కుంకుమ పడటంతో విహారి ఊదుతాడు. చారుకేశవ చాటుగా అది చూస్తాడు. విహారి బయటకు వెళ్లడం చూసి సహస్ర అంబికను తీసుకొని లక్ష్మీ గదికి వెళ్తుంది. లక్ష్మీని కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. లక్ష్మీ షాక్ అయితే ఇంట్లో తీసుకొస్తావ్ కదా ఆఫీస్‌లో తీసుకురావడానికి ప్రాబ్లం ఏంటి తీసుకురా అని అంబిక అంటుంది. లక్ష్మీ రాగానే ఎంతసేపు కాఫీ తీసుకురావడానికి అని సహస్ర అడుగుతుంది. లక్ష్మీ వెనకాలే విహారి వస్తాడు. విహారి కాఫీ తీసుకొని వచ్చి సహస్ర, అంబికలతో పాటు అందరికీ ఇస్తాడు. లక్ష్మీ దూరంగా నిల్చొని ఉంటే వచ్చి కూర్చొ అని చెప్తాడు. 

విహారి అందర్ని పంపేసి సహస్ర, అంబిక, లక్ష్మీలను కూర్చొపెడతాడు. ఆఫీస్‌లో అందరూ సమానమే మీరు ఇంట్లో ఎవర్ని ఎలా చూసినా ఒకే కానీ ఇక్కడ కుదరదు అని అంటాడు. మీకు కావాల్సినవి ఇవ్వడానికి వేరే వాళ్లు ఉన్నారు అంత అవసరం అయితే మీరు వెళ్లండి స్వయంగా తెచ్చుకోండి అని చెప్తాడు. లక్ష్మీని క్లైంట్ ప్రజంటేషన్‌లో ఓడించాలని సహస్ర అనుకుంటుంది. లక్ష్మీ ఇంకా ఆఫీస్‌లోనే ఉంటుంది. విహారి చూసి నేను ఉంటానని అంటాడు. చారు కేశవ మళ్లీ ఇద్దరినీ చూస్తాడు. ఇద్దరూ ఇంత టైం వరకు ఆఫీస్‌లో ఉన్నారేంటి అని అనుకుంటాడు. విహారికి వెళ్తాను అని చెప్పి చాటుగా దాక్కుంటాడు. వీళ్ల మధ్య ఏదో తేడా కొడుతుందని అనుకుంటాడు. ఇద్దరూ కలిసి కారులో బయల్దేరడం చూసి ఫాలో అవుతాడు. లక్ష్మీకి సీటు బెల్ట్‌ పెట్టుకోవడం రాకపోతే విహారి పెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫీల్‌ ది లవ్‌ బేబీ.. నన్ను ఎందుకు కాపాడావ్? దేవాకి మిథున లవ్‌ ప్రశ్నలు!