Star Maa serials trp ratings latest week: ప్రతి వారం తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లిస్ట్ చూస్తే... స్టార్ మా సీరియల్స్ ముందంజలో ఉంటాయి. ఈ వారం కూడా ఆ ఛానల్ సీరియల్స్ దూకుడు చూపించాయి. అందులోనూ 'కార్తీక దీపం 2' మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఏయే సీరియల్స్ ఉన్నాయి. జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి? ఈటీవీ, జెమినీ టీవీ సీరియల్స్ సంగతి ఏంటి? ఈ వారం టాప్ 10 లిస్టులో ఏయే సీరియల్స్ ఉన్నాయి? అనేది ఓ లుక్ వేయండి.
'స్టార్ మా'లో ఆ మూడింటి మధ్య పోటీ...కార్తీక దీపం 2 తర్వాత స్థానంలో ఎవరు?TRP ratings of Telugu serials Star Maa TV: 'స్టార్ మా'లో ఈ వారం టీఆర్పీ రేటింగ్స్ లిస్టు చూస్తే... టాప్ ప్లేస్‌లో 'కార్తీక దీపం 2' నిలిచింది. ఆ సీరియల్ 12.29 టీఆర్పీ సాధించింది.
'కార్తీక దీపం 2 - నవ వసంతం' తర్వాత స్థానంలో 11.19 టీఆర్పీతో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు', 10.38 టీఆర్పీతో 'గుండెనిండా గుడిగంటలు', 10.31 టీఆర్పీతో 'ఇంటింటి రామాయణం', 7.82 టీఆర్పీతో 'చిన్ని' నిలిచాయి. మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'బ్రహ్మముడి' (7.09), 'నువ్వుంటే నా జతగా' (6.62), 'నిన్ను కోరి' (6.08), 'పలుకే బంగారమాయెనే' (5.92), 'పాపే మా జీవనజ్యోతి' (5.42), 'వంటలక్క' (4.61), 'మగువా ఓ మగువా' (5.02) రేటింగ్ సాధించాయి.
'జీ తెలుగు' కాస్త బెటర్... వాటితో 'చామంతి' పోటీ!'స్టార్ మా' తర్వాత బుల్లితెర వీక్షకులను సీరియల్స్ ద్వారా ఆకట్టుకోవడంలో 'జీ తెలుగు' సక్సెస్ అవుతోంది. మరి, ఈ వారం ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే... 'మేఘ సందేశం' సీరియల్ 5.80 టీఆర్పీతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 5.59 టీఆర్పీతో 'జగద్ధాత్రి' రెండో స్థానంలో, 5.62 టీఆర్పీతో 'చామంతి' మూడో స్థానంలో నిలిచాయి. 5.02 టీఆర్పీతో 'లక్ష్మీ నివాసం' నాలుగో స్థానంలో 'అమ్మాయి గారు' సీరియల్ 4.63 టీఆర్పీతో ఐదో స్థానంలో నిలిచాయి.
రెండు సీరియళ్లు 'ఉమ్మడి కుటుంబం', 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి'... 3.59 టీఆర్పీ సాధించడం విశేషం. మిగతా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ చూస్తే... 'గుండమ్మ కథ', (3.61), 'పడమటి సంధ్యారాగం' (3.34), 'దీర్ఘ సుమంగళీ భవ' (3.53), 'ప్రేమ ఎంత మధురం' (3.26) టీఆర్పీ సాధించాయి. ఈ వారం జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ విషయంలో కొంత వెనుకబడ్డాయని చెప్పాలి. జెమినీ టీవీలో 'భైరవి' సీరియల్ ఒక్కటే 1.14 టీఆర్పీ సాధించింది. మిగతావన్నీ ఒక్కటి లోపే టీఆర్పీ రాబట్టాయి. ఈటీవీలో 'రంగుల రాట్నం' (3.29), 'మనసంతా నువ్వే' (3.17) సీరియల్స్ 3 ప్లస్ టీఆర్పీ సాధించగా... 'ఝాన్సీ' (2.86), 'బొమ్మరిల్లు' (2.80) చెప్పుకోదగ్గ టీఆర్పీ నమోదు చేశాయి. ఈటీవీలో కొత్త సీరియళ్లు ఏడు ఈ మధ్య మొదలు అయ్యాయి. రెండు మూడు వారాలు అయితే అవి ప్రజల్లోకి వెళ్లి ఆ ఛానల్ రేటింగ్స్ మరింత మెరుగు అవుతాయమో చూడాలి.
Also Read: పవన్ 'ఓజీ'లో చంద్రబాబు ఇంటికి కాబోయే కోడలు... మెగా మేనల్లుడు ఆట పట్టించడం వెనుక అసలు కహానీ