Ammayi garu Serial Today Episode రుక్మిణిలా ఉన్న రూప బంటీకి ఏం కాకూడదు అని అమ్మవారి గుడిలో పూజలు చేస్తుంది. అగ్ని గుండం తొక్కుతుంది. తర్వాత కుంకుమ తీసుకొని హాస్పిటల్‌కి బయల్దేరుతుంది. మరోవైపు విజయాంబిక, దీపక్‌లు బంటీని చంపడానికి తలగడ అడ్డు పెట్టి అణిచేస్తారు. అప్పుడే రాజు, రుక్మిణిలు అక్కడికి రావడం చూసి దీపక్ వాళ్లు వెళ్లిపోతారు. 

రుక్మిణి అమ్మవారి బొట్టు బంటీకి పెడుతుంది. బంటీ కంటి నుంచి కన్నీరు వస్తుంది. అమ్మా అమ్మా అని కళ్లు తెరుస్తాడు. రుక్మిణి, రాజులు చాలా సంతోషిస్తారు. విరూపాక్షి, సూర్యప్రతాప్‌కి పిలుస్తారు. ఇద్దరూ వచ్చి బంటీని చూసి చాలా హ్యాపీగా పీలవుతారు. విజయాంబిక, దీపక్‌ కూడా వచ్చి నటించేస్తారు. నాకు ఏమైంది ఎందుకు ఇక్కడ ఉన్నాను అని బంటీ అడుగుతాడు. చిన్న గాయం అయిందని సూర్యప్రతాప్‌ చెప్తారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని బంటీ అందరినీ అడుగుతాడు. ఏడ్వొద్దని అందరికీ చెప్తాడు. డాక్టర్ వచ్చి బంటీని చూస్తాడు. బంటీకి ఇక ఏ ప్రమాదం లేదని వారం రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. 

బంటీ డిశ్చార్జీ అయి ఇంటికి రావడంతో సుమ దిష్టి తీస్తుంది. పింకీ ఎలా ఉందని చంద్రని సూర్య అడుగుతారు. బాగానే ఉందని చెప్తారు. మేం కూడా సమయానికి ఇంట్లో లేం కదా అన్నయ్య అసలు బంటికి ఎలా గాయం అయింది అని అడుగుతారు. దానికి సూర్యప్రతాప్‌ బంటి హోమం వర్క్ చేస్తుంటే కళ్లద్దాలు కింద పడి పగిలిపోయావి మరో కళ్లద్దాలు ఉన్నాయేమో అని రాజుని అడబోయి మెట్ల మీద నుంచి కింద పడిపోయాడని సూర్యప్రతాప్‌ చంద్ర వాళ్లతో చెప్తారు. నా బిడ్డను కాపాడింది ఈ దేవత అని రాజు రుక్మిణిని చూపిస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఈ దేవత వల్లే బంటీ మనకు దక్కాడని రుక్మిణి గుడిలో చేసినవన్నీ చెప్తాడు. చేతిలో హారతి పెట్టిందని, పొర్లు దండాలు పెట్టింది అగ్నిగుండంలో దిగిందని రాజు చెప్తాడు. నాకోసం ఇంత చేశావా అమ్మా అని బంటీ అడుగుతాడు. 

రుక్మిణి మనసులో నువ్వు నా కొడుకువి బంటీ నీ కోసం నేను ఆ మాత్రం చేయనా అనుకుంటుంది. విజయాంబిక దీపక్‌తో ఇంత చేసింది అంతే ఇది రూప అయింటుందా అంటే అంత లేదు మామయ్యని ఎమోషనల్‌గా కొట్టడానికి ఈ రుక్మిణి ఇలా చేసిందని దీపక్ అంటాడు. సూర్యప్రతాప్‌ రుక్మిణి చేయి చూసి ఎందుకమ్మా ఇంత చేశావ్ అంటే నా కొడుకు ప్రాణం మీదకు వస్తే నేను ఎలా తట్టుకుంటా నాయనా అని అంటుంది. దానికి మందారం మనసులో అమ్మాయి గారు ఏంటి ఇలా నోరు జారారు అనుకుంటుంది. అందరూ నువ్వు రూపవే కదా అమ్మ అంటే దానికి రుక్మిణి నన్ను అమ్మాఅని పిలుస్తున్నాడు అలాంటప్పుడు వాడి కోసం ఈ మాత్రం చేయకపోతే ఆ పిలుపునకు అర్థం ఏం ఉంటుంది అని అంటుంది. నా అక్క బిడ్డ నా బిడ్డ కాడా నాయనా అని అడుగుతుంది. 

సూర్యప్రతాప్‌ ఏడుస్తూ రుక్మిణి తల నిమిరి రుక్మిణి బంటీ నిన్ను అమ్మ అని పిలిచి నందుకు ఇంత చేశావ్ ఏం ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలీదమ్మా పుట్టినప్పుడే చనిపోయాడు అనుకున్న నా మనవడిని రాజు కాపాడాడు. ఇప్పుడు నువ్వు పునర్జన్మ ఇచ్చావ్. నువ్వు నిజంగా మా పాలిట దేవతవి తల్లి అని అంటారు. రుక్మిణి ఏడుస్తూ బంటీ నా కొడుకు కాదు అని అన్ని సార్లు అనొద్దు నాయనా. బంటీ నా కొడుకే అని రుక్మిణి అంటుంది. చంద్ర, సుమలు నిన్ను చూస్తే మాకు రూప చనిపోయింది అని భావన కలగడం లేదని నిన్నురూప అని పిలవాలి అనిపిస్తుంది అని అంటారు. దానికి విజయాంబిక రూపని రూపలా మాత్రమే ఉంచండి. రుక్మిణిని రూపని చేయకండి అని అంటుంది. నన్ను మా అక్కని చేయలేరు కానీ అక్క చేయలేకపోయిన అన్నీ నేను చేస్తా అంటుంది. 

రూప వెళ్తూ వెళ్తూ నిన్ను మా కోసం పంపింది ఈ రోజు నీలో నిజంగా మా రూప కనిపిస్తుందని సూర్యప్రతాప్‌ అంటారు. బంటీ అమ్మా అని రుక్మిణిని హత్తుకుంటాడు. బంటీ నువ్వు ఏడ్వకూడదు.. మాట్లాడొద్దు అని డాక్టర్ చెప్పారు కదా అని విరూపాక్షి అంటే దానికి బంటీ అమ్మమ్మా నా కోసం చేతులు కాల్చుకుంది. కాలు కాల్చుకుంది నా ప్రాణం కోసం తన ప్రాణం పోయినా పర్లేదు అనుకుంది ఇలాంటి అమ్మతో ఎలా మాట్లాడకుండా ఉండాలి అమ్మ అని ఏడుస్తాడు. రూప, బంటీలు ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకుంటారు. రూప కోసం నేను ఏం చేయలేకపోయాను రూపకి చేయాల్సినవన్నీ నీలో రూపని చూసుకొని చేస్తానమ్మా అని సూర్యప్రతాప్‌ అంటారు. రుక్మిణిని సోఫా మీద కూర్చొపెట్టి తాను కింద కూర్చొని మందు పెట్టడానికి రెడీ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫీల్‌ ది లవ్‌ బేబీ.. నన్ను ఎందుకు కాపాడావ్? దేవాకి మిథున లవ్‌ ప్రశ్నలు!