బుల్లితెరతో పాటు వెండితెరపై తనదైన ముద్ర వేసిన విలక్షణ నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). టీవీ షోస్ హోస్టుగా, యాంకర్‌గా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆవిడ... 'క్షణం', 'రంగస్థలం', 'పుష్ప' వంటి సినిమాల్లో క్యారెక్టర్లతో ప్రేక్షకుల్ని మెప్పించారు. కొంత విరామం తర్వాత ఆవిడ మళ్ళీ బుల్లితెరకు వస్తున్నారు.
 
స్టార్ మా ఛానల్ (Star Maa Channel)లో ప్రసారం కానున్న గేమ్ షోలో అనసూయ న్యాయ నిర్ణేత (Anasuya As Judge)గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే విడుదలైన షో ప్రోమో వైరల్ అయ్యింది. అసలు, ఈ షోలో కంటెస్టెంట్లు ఎవరు? యాంకర్, న్యాయ నిర్ణేతలు ఎవరు? షో టెలికాస్ట్ టైమింగ్స్ ఏంటి? అన్నీ తెలుసుకోండి.

అనసూయతో పాటు జడ్జిగా శేఖర్ మాస్టర్...
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి యాంకరింగ్!
'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్'లో అనసూయ ఒక జడ్జ్ కాగా... ప్రముఖ కొరియోగ్రాఫర్ మరొక శేఖర్ మాస్టర్ మరొక జడ్జ్. అమ్మాయిలకు ప్రతినిధిగా అనసూయ భరద్వాజ్ వ్యవహరిస్తే... అబ్బాయిల తరఫున వాళ్ళకు అండగా శేఖర్ మాస్టర్ ఉంటారు. ఇక, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి దీనికి యాంకరింగ్ చేయనున్నారు. ఆల్రెడీ రిలీజైన ప్రోమో చూస్తే... అది అర్థం అవుతుంది. ప్రోమోలో బుల్లితెర నటీనటులు చాలా మంది కనిపించారు. మరి, బాయ్స్ టీమ్ ఎవరెవరు? గాళ్స్ టీమ్ ఎవరెవరు? తెలుసుకోండి. 

అబ్బాయిలు... అమ్మాయిలు... అటు 10 ఇటు 10!
'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్'లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. బాయ్స్ టీమ్ నుంచి పది మంది, గాళ్స్ టీమ్ నుంచి పది మంది షోలో సందడి చేస్తారు. వాళ్ళు ఎవరంటే...

నంబర్ బాయ్స్ టీమ్ గాళ్స్ టీమ్
1 అర్జున్ అంబటి ప్రియాంకా జైన్
2 అమర్ దీప్ చౌదరి శోభా శెట్టి
3 నిఖిల్ మలియక్కల్ అయేషా జీనత్
4 శ్రీకర్  ప్రేరణ కంభం
5 గౌతమ్ పల్లవి గౌడ
6 టేస్టీ తేజ విష్ణు ప్రియా భీమనేని
7 యాదమ్మ రాజు రీతూ చౌదరి
8 రవితేజ సౌమ్య రావు 
9 చైతు గోమతి
10 కిరణ్ గౌడ్ దీపిక

'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్' కాన్సెప్ట్ ఏమిటి?
Kiraak Boys Khiladi Girls Show Concept: అమ్మాయిలు, అబ్బాయిలు... ఇద్దరిలో ఎవరు గొప్ప? అనే ప్రశ్న వచ్చినప్పుడు 'మేం అంటే మేం' అని బాయ్స్ టీమ్, గాళ్స్ టీమ్ ముందుకు వస్తాయి. అప్పుడు రెండు టీమ్స్ మధ్య టాస్క్ పెడతారు. అందులో ఎవరు విజేతగా నిలుస్తారు? అనేది కాన్సెప్ట్. ఆట పాటలతో పాటు ఊహించని చిత్ర విచిత్రమైన టాస్కులు, రెండు టీమ్స్ మధ్య సవాళ్లు ఆసక్తికరంగా సాగుతాయట. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటల యుద్ధం సరదాగా ఉంటుందని, వీక్షకుల బోలెడంత వినోదం పంచుతుందని 'స్టార్ మా' ఛానల్ వర్గాలు తెలిపాయి. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా ఈ షో ఉంటుందని వివరించారు.

Also Readటాప్ విప్పేసిన అనసూయ... ముద్దులతో అయేషా... ఏడ్చిన అమర్ దీప్... ఏందిరా మీ రచ్చ!

షో టెలికాస్ట్ ఎప్పుడు? టైమింగ్స్ ఏంటి?
Kiraak Boys Khiladi Girls show timings: జూన్ 29వ తేదీ నుంచి 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్' షో 'స్టార్ మా'లో స్టార్ అవుతోంది. ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం కానుంది. ఆయా రోజుల్లో రాత్రి 9 గంటలకు టీవీలో షో సందడి మొదలు అవుతుంది.

Also Read: అందుకే అలా చేస్తాం.. కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా ఇబ్బందే - ‘జాకెట్’ ట్రోల్స్‌‌కు అనసూయ కౌంటర్