Anasuya Bharadwaj: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్.. ఎవరైనా తనకు నచ్చని కామెంట్ చేస్తే వారి అంతు చూసేవరకు వదలదు. కచ్చితంగా వారికి సమాధానం చెప్పేవరకు వదలదు. తాజాగా స్టార్ మాలో మొదలువుతున్న ఒక కొత్త షోకు అనసూయ యాంకర్‌గా చేస్తోంది. ఆ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అందులో అనసూయ కోటు విప్పడంపై గురించి కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా వారికి ఘాటుగా రిప్లై ఇచ్చింది ఈ భామ.


చేయకపోతే బెటర్..


స్టార్ మాలో త్వరలోనే ప్రారంభమవుతున్న 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్'లో శేఖర్ మాస్టర్‌తో పాటు అనసూయ కూడా ఒక జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇందులో అమ్మాయిలకు సపోర్ట్ చేస్తూ అనసూయ, అబ్బాయిలకు సపోర్ట్ చేస్తూ శేఖర్ మాస్టర్ కనిపించనున్నారు. అలా వీరిద్దరి మధ్య గట్టి పోటీ జరగనుందని ప్రోమోలో చూపించారు. ఇక ఈ ప్రోమో చివర్లో పోటీకి సిద్ధమంటూ తను వేసుకున్న జాకెట్‌ను విప్పేసింది అనసూయ. దానిపై నెటిజన్లు నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. ‘ఏమైనా అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు’ అని ఒక అమ్మాయి అనగా.. ‘మీ మైండ్ సరిగా లేదు’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఇక బుల్లితెరపై ప్రోగ్రామ్స్‌లో అలాంటివి చేయకపోతే బెటర్ అని మరొక వ్యక్తి సలహా ఇవ్వగా దానిపై కూడా తాను స్పందించింది.


ప్రోమో మాత్రమే..


‘‘ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులుగా మారుతున్న కాలాలను బట్టి, ఆడియన్స్ టేస్ట్‌ను బట్టి మేము కూడా కొత్త ప్రయత్నాలు చేస్తుంటాం. అయినా మీ ప్రతాపమంతా చిన్నతెరకే పరిమితమా? పెద్దతెర మీద ఎన్నో అభ్యంతరమైనవి వస్తున్నా మీరు బ్లాక్‌బస్టర్స్ చేస్తారు. పైగా షో మొత్తం చూసేవరకు కూడా మీ జడ్జిమెంట్స్ ఆగవు. అది కేవలం ప్రోమో మాత్రమే. అంటే దానికి ముందు, వెనుక వేరే కథ ఉంటుంది. అది అభ్యంతరకరమా కాదా అనేది ఎవరి లిమిట్స్‌ను బట్టి వారికి ఉంటుంది. కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా చాలా ఇబ్బందే. నేనేం చెప్పాలనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను’’ అని కౌంటర్ ఇచ్చింది అనసూయ.






మేము ఎంటర్‌టైనర్స్‌..


‘‘మా అందరికీ మాకు నచ్చింది చేసే హక్కు ఉంటుంది. ప్రోమో అనేది అందరికీ నచ్చేలా లేనందుకు సారీ. కానీ అది ఒక యాక్ట్ జరిగే ముందు జరిగిన విషయం. ఎంటర్‌టైనర్స్‌గా మా పని అదే’’ అంటూ మరో నెటిజన్‌కు కూల్‌గా సమాధానమిచ్చింది అనసూయ. మొత్తానికి తాజాగా విడుదలయిన 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్' ప్రోమో, అందులో అనసూయ ఎక్స్‌పోజింగ్ అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



Also Read: అమ్మే వేరే వ్యక్తుల దగ్గరకు పంపింది - అక్క అందరి ముందు నన్ను అవమానించింది: షకీలా