Neethone Dance 2.0 Winner 2024: బుల్లి తెర స్టార్, వెండి తెరపై హీరోగా సక్సెస్ కోసం ట్రై చేస్తున్న అమర్ దీప్ చౌదరి అభిమానుల కల నెరవేరింది. ఆయన విజేతగా నిలిస్తే చూడాలని... కప్పు అందుకుంటుంటే క్లాప్స్ కొట్టాలని... అమర్ విన్నర్ అంటుంటే వినాలని ఆశ పడిన అభిమానులకు 'నీతోనే డ్యాన్స్ 2.0' రియాలిటీ షో చాలా సంతోషాన్ని ఇచ్చింది. 'నీతోనే డ్యాన్స్ 2.0' ఫినాలేలో అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ జంట విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.


3... 2... 1... ఒక్కో మెట్టూ ఎక్కుతూ విజేతగా!
అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary) ట్రోఫీ అందుకున్న తర్వాత తన జర్నీ గురించి మాట్లాడమని చెబితే... '3 2 1' అన్నాడు. అంటే... 'నీతోనే డ్యాన్స్' ఫస్ట్ సీజన్‌లోనూ అతడు పార్టిసిపేట్ చేశాడు. కానీ, విజేత కాలేదు. మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 7కు వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన విన్నర్ కాలేదు. రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత 'నీతోనే డ్యాన్స్ 2.0'కి వచ్చాడు. ఈసారి గురి తప్పలేదు. ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు.


స్టార్ మా ఛానల్ రియాలిటీ షోస్ (Star Maa Channel Reality Show) మూడింటిలో అమర్ దీప్ చౌదరి పార్టిసిపేట్ చేయగా... ఫస్ట్ షోలో 3వ ప్లేస్, రెండో షోలో రెండో ప్లేస్, 3వ షోలో మొదటి స్థానం వచ్చాయి. అందుకని, '3 2 1' అన్నాడు అన్నమాట.


Also Read: టాప్ విప్పేసిన అనసూయ... ముద్దులతో అయేషా... ఏడ్చిన అమర్ దీప్... ఏందిరా మీ రచ్చ!






అమర్ దీప్ చౌదరిలో ఎంత మార్పు?
అమర్ దీప్ చౌదరి కప్ అందుకున్న మూమెంట్ అతడి అభిమానులు సంతోషాన్ని ఇస్తే... ఆ తర్వాత అవార్డు విన్నింగ్ స్పీచ్ మరింత సంతోషాన్ని ఇచ్చింది. అమర్ అంటే అగ్రెసివ్ అని ముద్ర పడింది. కోపధారి అని స్టాంప్ వేశారు కొందరు. కానీ, 'నీతోనే డ్యాన్స్ 2.0' విన్నింగ్ స్పీచ్ గమనిస్తే... మాటల్లో ఎక్కడా ఆ ఫైర్ అసలు కనిపించలేదు. పైపెచ్చు మరింత మెచ్యూరిటీ కనపడింది.


Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు






అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ దంపతులతో పాటు 'నీతోనే డ్యాన్స్ 2.0' ఫినాలేకి అతడి స్నేహితుడు మానస్ నాగులపల్లి - భాను శ్రీ జోడీ కూడా వచ్చింది. అయితే, వాళ్ళు విజేతలుగా నిలవలేదు. తాను విజేతగా నిలిచిన అమర్... తన విజయంలో మానస్ పాత్ర మరువలేదని, అతడు కూడా ఉన్నాడని స్టేజి మీదకు తీసుకు వచ్చాడు. అమర్ దీప్ చౌదరిలో ఈ మార్పు పలువురికి ఆశ్చర్యం కలిగించగా... అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. తమ హీరో మీద పడిన బ్యాడ్ రిమార్క్స్ అన్నీ తొలగుతాయని హ్యాపీగా ఫీల్ అయ్యారు.



'నీతోనే డ్యాన్స్ 2.0' ముగిసినా అమర్ దీప్ రియాలిటీ షోలో కనిపించడేమో అని బాధ పడాల్సిన అవసరం లేదు. స్టార్ మా కొత్త గేమ్ షో 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్'లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఆ షో టెలికాస్ట్ కానుంది.