వార్నీ... టీవీలో వచ్చే గేమ్ షో కోసమా ఇదంతా? అని నెటిజనులు ముక్కున వేలు వేసుకునేలా స్టార్ యాక్ట్రెస్, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో శనివారం నుంచి ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అంతలా వైరల్ కావడానికి అందులో ఏముంది? అని చూస్తే... అనసూయ తన బ్లేజర్ విప్పుతూ చేసిన గ్లామర్ షో. ఆ క్లిప్ మీరూ చూడండి.






నిజం చెప్పాలంటే... ఇంత కంటే ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫోటోల్లో అనసూయ భరద్వాజ్ గ్లామర్ షో చేశారు. కానీ, ఇక్కడ ఉన్నది ఆవిడ బ్లేజర్ విప్పే సీన్ కావడంతో నెటిజనులు కొందరు కళ్లప్పగించి చూశారు. మరికొందరు ఏందిరా ఈ రచ్చ అనుకున్నారు. చివరకు, ఇదొక గేమ్ షో వీడియో అని తెలుసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్'లో అనసూయ గ్లామర్ షో!
ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ 'స్టార్ మా' కొత్త గేమ్ షో స్టార్ట్ చేసింది. ప్రతి శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్' పేరుతో సరికొత్త గేమ్ షో టెలికాస్ట్ చేయనున్నట్లు చెప్పింది. ఆ గేమ్ షో ప్రోమో శనివారం ఉదయం రిలీజ్ చేశారు. అందులోని చివరి 20 సెకన్లలో 'నువ్వా నేనా' అన్నట్టు శేఖర్ మాస్టర్, అనసూయ తమ తమ టాప్స్ విప్పేసి సీన్ వైరల్ అవుతోంది. అదీ సంగతి. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇంత దిగజారాలా? అని ముక్కున వేలు వేసుకున్నారు.


శేఖర్ మాస్టర్ (Sekhar Master)ను ముద్దులతో ముంచెత్తిన...
'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోలో మరో హైలైట్... ఫిమేల్ కంటెస్టెంట్లలో ఒకరైన ఆయేషా జీనత్ చేసిన పని! శేఖర్ మాస్టర్ ఆమెకు టాస్క్ ఇవ్వగా... అందులో భాగంగా మిర్చి, వెల్లులి తినేసింది. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గరకు వెళ్లి అతడిని ముద్దులతో ముంచెత్తింది.


ఏడ్చిన అమర్ దీప్... ఎందుకో తెలుసా?
గ్లిజరిన్ లేకుండా ఏడవాలని 'కిరాక్ బాయ్స్'కు అనసూయ టాస్క్ ఇచ్చారు. ఆవిడ ఆ మాట చెప్పిన తర్వాత ఒక్కసారిగా అమర్ దీప్ షాక్ అయ్యాడు. కానీ, అర్జున్ అంబటి ఏడ్చి చూపించాడు. తర్వాత శేఖర్ మాస్టర్‌ను ఒక ఫిమేల్ కంటెస్టెంట్ ఎత్తుకోగా... అమర్ దీప్ ఒక్కసారిగా ఏడ్చాడు. దాంతో అందరూ నవ్వేశారు.


Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు






అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య జరిగే ఈ 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్' షోలో విజేతకు 20 లక్షల ప్రైజ్ మనీ అని చెప్పారు. ఈ షోలో అర్జున్ అంబటి, అమర్ దీప్, దీపికా రంగరాజు, అయేషా, శోభా శెట్టి, విష్ణు ప్రియ భీమనేని, రీతూ చౌదరి తదితరులు పార్టిసిపేట్ చేస్తున్నారు. అబ్బాయిల తరఫున శేఖర్ మాస్టర్, అమ్మాయిల తరఫున అనసూయ భరద్వాజ్ జడ్జ్ సీటుల్లో కూర్చున్నారు.


Also Readకాబోయే భర్త, పెళ్లి కోసం సోనాక్షి సిన్హా ముస్లిం మతంలోకి మారుతుందా? క్లారిటీ ఇచ్చిన పెళ్లి కొడుకు తండ్రి