Anasuya Bharadwaj New TV Show: అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇటు వెండి తెర... అటు బుల్లి తెర... రెండు చోట్ల ఆవిడ సక్సెస్ అందుకున్నారు. రెండిటిలో అనసూయకు ఎక్కువ పాపులారిటీ తెచ్చినది ఏదైనా ఉందంటే... టీవీ షోస్ అని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఆవిడ టీవీకి వచ్చారు. కొత్త షో చేస్తున్నారు. 


'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్'...
రీ ఎంట్రీలో అందాలతో రచ్చ రచ్చ!
Kiraak Boys Khiladi Girls Show: 'స్టార్ మా' ఛానల్ సరికొత్త గేమ్ షో స్టార్ట్ చేసింది. ఈ నెల (జూన్ 29) నుంచి 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్' షో మొదలు పెడుతోంది. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆ షో టెలికాస్ట్ కానుంది. ఇంతకీ, ఆ షోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? 


బాయ్స్ ప్రతినిధిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జ్ సీటులోకి వస్తే... గర్ల్స్ ప్రతినిధిగా జడ్జ్ సీటులోకి అనసూయ భరద్వాజ్ వచ్చారు. 'జబర్దస్త్'లో అనసూయ కనిపించడం లేదని ఫీలయ్యే బుల్లి తెర వీక్షకులు అందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒక విధంగా అనసూయకు టీవీలో రీ ఎంట్రీ.


Also Read: ప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు






పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'పుష్ప: ది రైజ్'లో అనసూయ భరద్వాజ్ చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరూ కాదనలేని విషయం అది. కానీ, ఆ సినిమాకు ముందు ఆవిడ పాపులారిటీకి కారణం 'జబర్దస్త్' షో. కారణాలు ఏవైనా సరే... ఆ షో నుంచి అనసూయ తప్పుకున్నారు. ఆ తర్వాత ఆవిడ ప్లేసులోకి చాలా మంది వచ్చారు కానీ ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేదు. ఇప్పుడు 'జబర్దస్త్' షో ఫార్మటు మారడంతో పాటు రెండు రోజులకు రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్నారు. ఆ షో ఈటీవీలో వస్తుంది. అనసూయ షో 'స్టార్ మా'లో వస్తుంది. ఇప్పుడు ఎవరి షోకి ఎక్కువ రేటింగ్ వస్తుందో చూడాలి.


Also Readకాబోయే భర్త, పెళ్లి కోసం సోనాక్షి సిన్హా ముస్లిం మతంలోకి మారుతుందా? క్లారిటీ ఇచ్చిన పెళ్లి కొడుకు తండ్రి



అనసూయ చేస్తున్న సినిమాలకు వస్తే...
Anasuya Bharadwaj Upcoming Movies: 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ 'పుష్ప: ది రూల్' సినిమాలో అనసూయ మరోసారి దాక్షాయణి పాత్రలో సందడి చేయనున్నారు. అది కాకుండా తమిళంలో 'ఫ్లాష్ బ్యాక్' అని మరొక సినిమా చేస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన 'రజాకార్' సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేశారు. ఆవిడ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయని సమాచారం.