Sonakshi Sinha Zaheer Iqbal Wedding: బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా పెళ్లి సందడి మొదలు అయ్యింది. నటుడు జహీర్ ఇక్బాల్, ఆమె త్వరలో వివాహ బంధంలో అడుగు పెట్టడానికి సిద్ధం అయ్యారు. సోనాక్షి హిందువు అయితే... ఆమె పెళ్లి చేసుకోబోయేది ముస్లిం యువకుడిని. మరి, ఈ పెళ్లి కోసం ఆవిడ మతం మారుతుందా? - ఈ ప్రశ్న పలువురిలో కలగడం సహజం. దీనికి పెళ్లి కొడుకు తండ్రి క్లారిటీ ఇచ్చారు. 


అమ్మాయి పెళ్లి కోసం మతం మారదు!
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు. మరి, వాళ్లిద్దరి వివాహం పెళ్లి కుమార్తె కోసం హిందూ సంప్రదాయంలో జరుగుతుందా? లేదంటే పెళ్లి కొడుకు కోసం ముస్లిం పద్ధతి ప్రకారం జరుగుతుందా? ఇరువురి పద్ధతులను అనుసరిస్తూ రెండు పెళ్లిళ్లు చేసుకుంటారా? అనే సందేహం రావడం సైతం సహజమే. దీనికి పెళ్లి కొడుకు జహీర్ ఇక్బాల్ తండ్రి ఇక్బాల్ రాటాన్సీ స్పష్టత ఇచ్చారు. 


''జహీర్, సోనాక్షి సివిల్ మ్యారేజ్ చేసుంటారు. హిందూ లేదా ముస్లిం పద్ధతుల ప్రకారం పెళ్లి జరగడం లేదు'' అని జహీర్ ఇక్బాల్ తండ్రి చెప్పారు. సోనాక్షి మతం మారుతుందా? లేదా? అనే ప్రశ్నకు సైతం ఆయన స్పష్టత ఇచ్చారు. ''అమ్మాయి (సోనాక్షి సిన్హా) ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వడం లేదు. అది అయితే పక్కా! వాళ్లిద్దరి మనసులు కలిశాయి. అక్కడ మతంతో ఎటువంటి సంబంధం లేదు. నేను మానవత్వాన్ని నమ్ముతా. దేవుడిని హిందువులు భగవాన్ అంటారు. ముస్లింలు అల్లా అంటారు. చివరకు, భూమ్మీద మనమంతా మనుషులమే. నా ఆశీస్సులు వాళ్లిద్దరికీ ఎప్పుడూ ఉంటాయి'' అని ఇక్బాల్ తండ్రి రాటాన్సీ చెప్పారు.


Also Read: ఆ పుకార్లకు చెక్‌, సోనాక్షి పెళ్లికి అంతా సిద్ధం - తల్లితో కలిసి పూజ చేసిన నటి



పెళ్లి కోసం అమెరికా నుంచి సిన్హా బంధువులు
ఏడేళ్ల నుంచి సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ టాక్. ఈ జంట తొలుత కలిసింది సల్మాన్ ఖాన్ ఇచ్చిన పార్టీలో అని, ఆ పరిచయం తర్వాత ప్రేమకు దారి తీసిందని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి. 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో సోనాక్షి, జహీర్ జంటగా నటించారు. ఒక మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించారు.


Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమా.. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివీల్ చేసిన కీరవాణి


సోనాక్షి సిన్హా ప్రేమ పెళ్లికి ఆమె తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు & ఎంపీ శత్రుఘ్న సిన్హా ఫ్యామిలీ ఒప్పుకోలేదని తొలుత వార్తలు వచ్చాయి. అయితే...  ఈ మధ్య జరిగిన పార్టీలో కాబోయే అల్లుడిని ఆయన అందరికీ పరిచయం చేయడంతో సంతోషంగా కనిపించారు. పెళ్లి కోసం శత్రుఘ్న సిన్హా సోదరులు సైతం అమెరికా నుంచి వస్తున్నారని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు చెప్పారు. జహీర్ ఇక్బాల్ ఇంటిలో రిజిస్టర్ మ్యారేజ్ జరుగుతుందని తెలిపారు. తాను పెళ్లికి హాజరు కావడం లేదని వచ్చిన వార్తలను సైతం సోనాక్షి తండ్రి ఖండించారు. తన కుమార్తెకు తాను ఎప్పుడూ ఒక కవచంలా ఉంటానని, కుమార్తెను చూస్తే గర్వంగా ఉందని ఆయన చెప్పారు.